ఈ ప్రశ్న ఏపీలో మేధావులకు ఎందుకు తట్టలేదబ్బా?

August 05, 2020

ఏపీ సర్కారు దివాలా తీసిందా? ఇది ఈరోజు హైకోర్టు వేసిన ప్రశ్న. హైకోర్టు వేసిన ఈ ఒకే ఒక ప్రశ్న... ఏపీ సర్కారు బుద్ధిని బయటపెట్టింది. కోర్టు వేసిన ఈ ప్రశ్న... ఏపీలో మేధావులు అని పిలవబడే వారికి ఎవరికి ఇంతవరకు తట్టకపోవడం ఆశ్చర్యకరం. 

ఏపీలో అసలు ఆర్థిక శాస్త్ర నిపుణులే లేరా? మరీ ఏపీ అంత దారుణంగా ఉందా ? అన్న అనుమానం రాక మానదు. ఇది అత్యంత సాధారణమైన ప్రశ్న. భూములు అమ్మి అభివృద్ధి పనులు చేపట్టడాన్ని ప్రశ్నించిన కోర్టు... ‘‘ఏపీ సర్కారు దివాలా తీసిందా’’ అని సూటి ప్రశ్న వేసింది. 

ఒక కంపెనీ, లేదా ఒక మనిషి ఆస్తులు ఎపుడు అమ్ముతారు? ఆదాయానికి వేరే మార్గం లేకపోతే అమ్ముతారు. లేదా ఇంకో ఆస్తి కొనడానికి అమ్ముతారు. ఏపీ సర్కారు ఇంకో ఆస్తి ఏమీ కొనడం లేదు కదా. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల కోసం ఆస్తులు అమ్ముతున్నారు. దీనిని కోర్టు ప్రశ్నించింది. 

బిల్డ్ ఏపీ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ ను హైకోర్టు విచారించింది. ప్రభుత్వం దివాళా తీసిందా, ఎందుకు ఆస్తులు అమ్ముతున్నారు? సంచలన వ్యాఖ్యలు చేసింది.  

ఏపీకి వేల కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఏపీలో ప్రజలు ధనవంతులు,  ప్రభుత్వం పేదరికంలో ఉన్నట్లు వ్యవహారం కనిపిస్తోందన్నారు. లాక్ డౌన్ అమల్లో ఉండగా ఇంత అర్జెంటుగా వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏంటని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. 

ఇది ప్రజా ప్రయోజనాలు ముడిపడిన అంశం. ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి ఇచ్చే ఉత్తర్వులకు లోబడి వేలం నిర్వహించండి అంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ తదుపరి విచారణను మే 28వ తేదీకి వాయిదా వేసింది. 

అయితే, లిక్కరుపై ప్రెస్ మీట్ పెట్టిన వారు, పింక్ డైమండ్ల గురించి ఆందోళన చెందిన వారు, జగన్ వస్తేనే మా కుల ఉద్దరణ అని గద్దించిన వారు ఏకంగా ఏపీ ఆస్తులను తెగనమ్ముతుంటే పల్లెత్తు మాటనరు. ప్రశ్నించరు? మేధావుల నోళ్లు మూగబోయాయా?