ఏపీ షట్ డౌన్

June 05, 2020

కరోనా బాధ ఏపీ ప్రజలకు కూడా తప్పలేదు. ఈ మహమ్మారి దెబ్బకు కొన్ని నిమిషాల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించగా... ఏపీ ముఖ్యమంత్రి కూడా అదే బాటలో నిలిచారు. ఈనెల 31 వరకు అంటే మరో 8 రోజుల పాటు ఏపీలో అన్ని కార్యకలాపాలను ఆపివేస్తూ.. లాక్ డౌన్ ప్రకటించారు. అత్యవసర సేవలు తప్ప ఏవీ అందుబాటులో ఉండవు. దుకాణాలు, మాల్స్ అన్నీ బంద్. పరిస్థితి ఇటలీలా చేజారిపోకుండా అందరూ మేల్కొంటున్నారు. అందులో భాగంగా ఏపీలో  కూడా ముందుజాగ్రత్తగా లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ అయ్యాయి. 

ఏపీ పేదలకు వెయ్యి రూపాయల నగదు, రేషన్ పంపిణీ చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే... మార్చి 29నాటికి అందజేస్తాయని తెలిపింది. అప్పటివరకు మరి పేదవాడు ఏం తినాలి. రోజు కూలీ మీద బతికేవారి పరిస్థితి ఏంటి జగన్ గారు?