1,80,000 కోట్లు : ఏపీకి జ‌గ‌న్ రెడ్డి చేసిన నష్టం

February 19, 2020

1,80,000 కోట్లు...ఇదేంటి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్ట‌బోయే బ‌డ్జెటా అనుకుంటున్నారా?  కాదండి. ప్ర‌స్తుత‌ ఏపీ ప్ర‌భుత్వం ఘ‌న‌కార్యాల‌ వ‌ల్ల‌...ఆరు నెలలలో ఆంధ్రా నుండి వెనక్కి వెళ్లిపోయిన పెట్టుబడుల విలువ‌. ఒక‌టి కాదు రెండు కాదు..దేశీయ కంపెనీలు...అంత‌ర్జాతీయ కంపెనీల‌ని కాదు...ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఇలా ఏపీకి టాటా చెప్పేశాయి. అలా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను వీడిన కంపెనీల పెట్టుబ‌డుల విలువ ఈ 1,80,000 కోట్లు. ఏపీ ముఖ్య‌మంత్రి హోదాలో టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని కంపెనీలు తెస్తే జగన్‌ ఇంట్లో కూర్చుని గడప దాట‌కుండానే...కంపెనీల‌ను రాష్ట్రాన్ని దాటించారు.

ఒక్కో పెట్టుబ‌డి విష‌యానికి వ‌స్తే దేశీయంగా పేరొందిన అదానీ గ్రూప్ రూ.70,000 కోట్లు, ఒంగోలు పేప‌ర్ మిల్లు 24,000 కోట్లు, రిల‌య‌న్స్ రూ.15,000 కోట్లు, బీఆర్‌టీ గ్రూప్ రూ.14,000 కోట్లు, వ‌ర‌ల్డ్ బ్యాంక్ రూ.2,400 కోట్లు, లులూ గ్రూప్  రూ. 2,200 కోట్లు, ఆసియాన్ బ్యాంక్ రూ.1,400 కోట్లు. ఇంతేకాకుండా ఫ్రాంక్లిన్ టెంపుల్ట‌న్‌, కియా యొక్క అనుబంధ సంస్థ‌లు, భారీ స్థాయిలో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకున్న మ‌రికొన్ని కంపెనీలు ఏపీకి బైబై చెప్పేశాయి.  అదే స‌మ‌యంలో పొరుగు రాష్ట్రంలో ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్నాయి.

ఇలా 1,80,000 కోట్ల పెట్టుబ‌డులు వెన‌క్కి పోవ‌డం వ‌ల్ల ప్ర‌థ‌మ న‌ష్టం ఏంటో తెలుసా?  ఏపీ వైపు మ‌రే కంపెనీ క‌న్నెత్తి చూసే సాహ‌సం చేయ‌వు. దేశ‌వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు పోటీ ప‌డీ కంపెనీల‌ను పిలుస్తున్న స‌మ‌యంలో...వ‌చ్చిన కంపెనీలు వెళ్లిపోయాయంటే...స‌హ‌జంగానే మ‌రే కంపెనీ ముందుకు రాదు క‌దా. ఇక రెండో అంశం...ఈ పెట్టుబ‌డుల వ‌ల్ల రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయానికి స‌హ‌జంగానే బొక్క ప‌డుతుంది. దాంతో ఖ‌జానా డొల్ల‌గా మారుతుంది. మూడోది అత్యంత ముఖ్య‌మైనంది. ఇంత భారీ స్థాయిలో పెట్టుబ‌డులు వ‌స్తే... స‌హ‌జంగానే క‌నీసం 20 ల‌క్ష‌ల ప్ర‌త్య‌క్ష ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రిగేది. ఆ మేర‌కు మ‌న రాష్ట్రానికి చెందిన యువ‌త‌కు ఉపాధి దొరికేది. ఇప్పుడు వారంతా స‌ర్టిఫికేట్లు చేతుల్లో పెట్టుకొని ప‌క్క రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లాల్సిందే లేదంటే నిరాశ‌లో కూరుకుపోయి అవాంచ‌నీయ ప‌రిస్థితుల‌ను ఆశ్ర‌యించాల్సిందే.