ఎర్ర‌వ‌లి కేత్రంలో... వైసీపీ ఎంపీ అభ్య‌ర్థుల ఖ‌రారు!

July 21, 2019
CTYPE html>

ఏపీలో విప‌క్షం వైసీపీకి చెందిన ఎంపీ సీట్ల‌కు అభ్య‌ర్థుల ఖ‌రారుపై ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... వైసీపీ ఎంపీల అభ్య‌ర్థుల ఎంపిక‌లో కీల‌క భూమిక పోషిస్తోంద‌ని నిన్న‌టిదాకా విమ‌ర్శ‌లు వినిపిస్తే... ఇప్పుడు తాజాగా ఈ వ్య‌వ‌హారం మొత్తం తెలంగాణ కేంద్రంగా సాగుతోంద‌ని వినిపిస్తోంది. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు సిద్ధిపేట జిల్లా ఎర్ర‌వ‌లి వ్య‌వ‌సాయ క్షేత్రంలో ఈ త‌తంగం న‌డుస్తోందని టీడీపీ సినియ‌ర్ నేత‌, ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.
ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల మ‌ధ్య పెద్ద వివాదంగా మారిన డేటా చోరీ విష‌యంపై మాట్లాడేందుకు మీడ‌యా ముందుకు వ‌చ్చిన దేవినేని... జ‌గ‌న్‌, కేసీఆర్ ల మైత్రిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ అభ్య‌ర్థుల ఖ‌రారు... ఆ పార్టీ కేంద్ర కార్యాల‌యం లోట‌స్ పాండ్ లో జ‌ర‌గ‌డం లేద‌ని, కేసీఆర్ త‌న ఫాం హౌస్‌లో కూర్చుని ఈ తంతును కొన‌సాగిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే రాత్రికి రాత్రే వైసీపీ అభ్య‌ర్థులు మారిపోతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా కేసీఆర్ పావులు క‌దుపుతున్నార‌ని, ఇందుకోసం ఎన్ని అక్ర‌మ మార్గాల‌ను అనుస‌రించాలో అన్నింటినీ అమ‌లు ప‌రిచేస్తున్నార‌ని దేవినేని ధ్వ‌జ‌మెత్తారు. 
ఇందులో భాగంగానే టీడీపీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌ల‌ను భ‌య‌పెడుతున్న కేసీఆర్‌... వారిని వైసీపీలో చేరేలా బ‌ల‌వంతం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇందులో భాగంగా త‌మ పార్టీ నేత‌ల‌కు ప్ర‌త్యేకించి హైద‌రాబాద్ లో ఆస్తులు ఉన్న టీడీపీ నేత‌ల‌కు బెదిరింపులు ఎదుర‌వుతున్నాయ‌ని కూడా దేవినేని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడును ఒంట‌రిగా ఎదుర్కోలేక‌నే అటు మోదీతో పాటు ఇటు కేసీఆర్ కూడా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ద్వారా మంత్రాంగం న‌డుపుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. మొత్తంగా ఏపీలో సీఎం పీఠంపై కూర్చోవ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న జ‌గ‌న్‌... త‌న‌కు దొడ్డిదారిన స‌హ‌క‌రించేందుకు ముందుకు వ‌చ్చిన కేసీఆర్‌, మోదీల మ‌ద్ద‌తుకు త‌లొంచార‌ని దేవినేని ధ్వ‌జ‌మెత్తారు.