జీరో వ్య‌వ‌సాయం... చంద్రబాబు సైలెంట్ కిల్లర్

August 08, 2020

తాజాగా కేంద్రం ప్ర‌వేశ పెట్టిన 2019-20 వార్షిక బ‌డ్జెట్లో సంచ‌ల‌న నిర్ణ‌యం. రైతుల‌కు మేలు చేసే విధంగా జీరో బేస్డ్ అగ్రిక‌ల్చ‌ర్ దీనిని వ‌చ్చే ఐదేళ్ల‌లో దేశం విస్త‌రిస్తామ‌ని బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఘ‌నంగా ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి దేశంలోని రైతుల‌కు మెరుగైన శిక్ష‌ణ కూడా ఇస్తామ‌ని చెప్పారు. క‌ట్ చేస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఈ త‌ర‌హా వ్య‌వ‌సాయం లేదా ? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. అయితే, కొన్నిద‌శాబ్దాల కింద‌టే దేశంలో వ్య‌యర‌హిత వ్య‌వ‌సాయం అమ‌ల్లో ఉంది. ఇప్ప‌టికీ క‌ర్ణాట‌క‌లోని చాలా ప్రాంతాల్లో జీరో బేస్ట్ వ్య‌వ‌సాయం సాగు చేస్తున్నారు. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా దీనిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా 2024 నాటికి రాష్ట్రంలోని ప్ర‌తి క‌మ‌తం కూడా జీరో బేస్ట్ వ్య‌వ‌సాయంగానే ఉండాల‌ని ఆయ‌న ల‌క్షంగా పెట్టుకున్నారు.

జీరో బ‌డ్జెట్ నేచుర‌ల్ ఫార్మింగ్ ల‌క్ష్యం.. మాన‌వ ఆరోగ్యం స‌హా సామాజిక స‌మ‌స్య‌ల‌ను అంతం చేసే విధంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 2018 ఫిబ్ర‌వ‌రి 2వ తారీకునే అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు దీనిపై ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించి, దీనిని ప్ర‌క‌టించారు. దాదాపు 60 ల‌క్షల మంది రైతుల‌కు దీనిలో శిక్ష‌ణ ఇవ్వ‌డం ద్వారా 80 ల‌క్ష‌ల హెక్టార్ల‌ను జీరో బ‌డ్జెట్ వ్య‌వ‌సాయం కింద‌కు తీసుకురావాల‌ని నిర్ణ‌చించారు. దీనికార‌ణంగా కృత్రియ ర‌సాయ‌నాలు వినియోగించ‌ని ఎరువులు, పురుగు మందుల‌ను వాడ‌కుండా స‌హ‌జ స‌ద్ధంగానే ఎరువుల‌ను, పురుగు మందుల‌ను త‌యారు చేసుకుంటారు. ఫ‌లితంగా రైతుల‌పై పెట్టుబ‌డి భారం అనూహ్యంగా త‌గ్గుతుంది. ఈ క్ర‌మంలో 2024 సంవ‌త్స‌రానికి రాష్ట్రాన్ని దేశంలోనే జీరో బ‌డ్జెట్ నేచుర‌ల్ ఫార్నింగ్‌లో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉండేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు. చంద్ర‌బాబు చేసిన ఈ ప్లాన్‌తో అరెక‌రం పొలంలో కూడా రూ.50 వేలు ఆదాయం పొందిన వారు ఉన్నారు.

ఇక‌, సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల‌ను సాధించే క్ర‌మంలో జీరో బేస్ట్ బ‌డ్జెట్ నేచుర‌ల్ ఫార్మింగ్‌ను ఐక్య‌రాజ్య‌స‌మితి కూడా ప్రోత్స‌హించింది. పేద‌రికాన్ని దునుమాడ‌డం, స్వ‌చ్ఛ‌మైన నీరు, ప‌రిశుభ్ర‌త, భాధ్య‌తాయుత‌మైన వినియోగం, ఉత్ప‌త్తి, లైఫ్- ల్యాడ్ ల‌క్ష్యాల్లో భాగంగా నేచుర‌ల్ ఫార్మింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ విష‌యంలో అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దూకుడుగా వ్య‌వ‌హ‌రించింది. ఐక్య‌రాజ్య‌స‌మితి ల‌క్ష్యాల‌ను అందిపుచ్చుకుని రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలోని ప్ర‌తి రైతును జీరో బ‌డ్జెట్ సాగు దిశ‌గా న‌డిపించే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. దీనికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వంలోని సుస్థిర భార‌త నిధుల‌ను వినియోగించుకునేందుకు ప్ర‌య‌త్నించింది.

అదే స‌మ‌యంలో ఐక్య‌రాజ్య‌స‌మితిలోని ప‌ర్యావ‌ర‌ణ విభాగం, బీఎన్‌పీ పారిబాస్, ప్ర‌పంచ ఆగ్రోఫారెస్ట్రీ కేంద్రాలు కూడా ఏపీలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములుగా చేరాయి. వాత‌వార‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు ల‌భించింది. ఏపీ ప్రారంభించిన కార్య‌క్ర‌మంలో తాము భాగ‌స్వాములు అయినందుకు ఐక్య‌రాజ్య‌స‌మితిలోని ప‌ర్యావ‌ర‌ణ విభాగం సంతోషం వ్య‌క్తం చేసింది. ఉత్ప‌త్తిదారులైన రైతుల‌కు, వినియోగ‌దారులైన ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య మ‌రింత‌గా సంబంధాలు పెరుగుతాయ‌ని అభిప్రాయ‌ప‌డింది. రాష్ట్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని ఘ‌న‌మైన‌దిగా ఐక్య‌రాజ్య‌స‌మితి అప్ప‌ట్లోనే కొనియాడింది.

ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఒక్క రాష్ట్రానికి, దేశానికే కాకుండా ఐక్య‌ర‌జ్య‌స‌మిగి ల‌క్ష్యాల‌ను కూడా స‌మ‌ర్థంగా నిర్వ‌హించి మంచి పేరు తెచ్చుకునే అవ‌కాశం క‌ల్పించింద‌ని పేర్కొంది. హ‌రిత విప్ల‌వాన్ని భుజానికి ఎత్తుకున్న రాష్ట్రంగా, నేచుర‌ల్ ఫార్మింగ్‌ను సాకారం చేసే రాష్ట్రంగా ఏపీ చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయ‌మ‌ని జీరో బేస్డ్ బెడ్జెట్ వ్య‌వ‌సాయం ప్రారంభం సంద‌ర్భంగా ఐక్య‌రాజ్య‌స‌మితి నుంచి మేధావులు అభిప్రాయ‌ప‌డ్డారు. మొత్తంగా చూసుకుంటే.. దేశంలో ప్ర‌ధాని మెడీ ప్ర‌వేశ పెట్టాల‌ని భావిస్తున్న జీరో బేస్డ్ వ్య‌వ‌సాయాన్ని 2018లోనే చంద్ర‌బాబు అమ‌ల్లో పెట్టి ఏపీని దేశంలోనే నేచుర‌ల్ ఫార్మింగ్‌లో తొలిస్థానంలో నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం తెలుగువారికి గ‌ర్వ‌కార‌ణమే క‌దా..!!

Some Important links about ZERO BUDGET NATURAL FARMING

UNO LINK on AP : https://www.unenvironment.org/news-and-stories/press-release/andhra-pradesh-become-indias-first-zero-budget-natural-farming-state 

Chandrababu 100 crore reward : https://www.news18.com/news/india/andhra-farmers-who-win-nobel-prize-in-natural-farming-to-get-rs-100-crore-chandrababu-naidu-1898777.html 

Full detailed story : https://india.mongabay.com/2018/09/andhra-pradeshs-push-for-zero-budget-natural-farming-inspires-others/