​ఇక వారు జన్మలో జగన్ కి ఓటేయరు 

February 23, 2020

ఒక్క ఛాన్స్... వారి జీవితాలను సర్వ నాశనం చేసింది. ఒక్క ఓటు వారి పొ​ట్ట మీద కొట్టింది. ఇది ఎవరి గురించి అనుకుంటున్నారా? దిన కూలీ మీద బతికే కార్మికుల గురించి. నగరాల్లో అత్యధిక పేదలు భవన నిర్మాణ రంగంపై ఆధారపడి బతుకుతారు. ఉపాధి కల్పనలో, డబ్బును రొటేట్ చేయడంలో అదిపెద్ద రంగం ఇదే. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక కోటి మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. అంటే భవన నిర్మాణ కార్మికులు... గృహ సంబంధిత ఉత్పత్తులు అమ్మే పరిశ్రమలు, దుకాణాలు ఇవన్నీ స్తంభించి పోయాయి. కేవలం ఇసుక ఆగిపోతే జరిగే నష్టాన్ని, దాని ప్రభావాన్ని అంచనా వేసే అనుభవం ముఖ్యమంత్రి జగన్ కి లేకపోవడం వల్ల ఈ తీవ్ర నష్టం వాటిల్లింది. 

ఏపీలో ఏ మూలకు వెళ్లినా... ప్రతి భవన నిర్మాణ కార్మికుడిది ఒకటే ఆవేదన. జగన్ కి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామని అనుకుని మా జీవితాల్లో నిప్పులు పోసుకున్నామని వారు వేదన చెందుతున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే తాము బాగుపడతాం అనుకున్నాం గాని ఇలా సర్వనాశనం అవుతామని కలలో కూడా ఊహించలేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గోరు చుట్టు మీద రోకటి పోటు లాగా... ఒక వైపు ఉపాధి లేదు. మరోవైపు కూలీ లేనపుడు 5 రూపాయలకు కడుపు నిండా దొరికే అన్న క్యాంటీను భోజనం కూడా లేకుండా పోయింది. దీంతో కూలీ మాత్రమే కాకుండా జగన్ వచ్చి తమ నోటి కాడ కూడు కూడా లాక్కున్నాడని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. జగన్ మీద, వైసీపీ నేతల మీద శాపాలు పెడుతున్నారు. 

అనుభవం లేని వ్యక్తికి ఒక్క ఛాన్స్ ఇస్తే... మంచి జరగపోయినా చెడు జరగదు అనుకున్నామని, వైఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ భూమి చూసి... జగన్ వస్తే అంత కంటే ఎక్కువ వస్తుందనుకున్నామని ...కానీ ఉన్నది కూడా పోయిందని వారు కన్నీటి వేదన చెందుతున్నారు. ఏ రకంగా చూసినా... ఏపీకి గడ్డు రోజులే ఉన్నాయని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇక వెనక్కి వెళ్లిపోయిన పరిశ్రమల వల్ల కలిగిన నష్టం... ఐదేళ్లు ఏపీ టీం మొత్తం రాత్రింబవళ్లు కష్టపడినా కూడా తిరిగి పూడ్చలేని పరిస్థితి. 

కొసమెరుపు ఏంటంటే...  ప్రభుత్వ వ్యవహారశైలి వల్ల ఉపాధి లేక భవన నిర్మాణ కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే... ప్రభుత్వం మీద పడి ఏడవకపోతే వేరే పని వెతుక్కోవచ్చు కదా శ్రీమతి లక్ష్మీపార్వతి గారు సెలవచ్చారు. మహాసాధ్వి కదా... మంచి సలహా ఇచ్చారమ్మా మీరు థాంక్స్ !!!  ఇంత నరకం చూశాక... ఈ రంగానికి చెందిన వారు ఎవరైనా జీవితంలో జగన్ కు మళ్లీ ఓటు వేసే పరిస్థితి కనిపించడం లేదు.