అభాసుపాలైన ఏపీ పోలీసు 

June 03, 2020

చంద్రబాబు పాలనలో ఎవరు ఏం చేసినా నిరంకుశ రాజ్యం, పోలీసు రాజ్యం అని చెప్పేవారు జగన్. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు వైసీపీ అధినేత నుంచి కార్యకర్త వరకు అందరూ చంద్రబాబును బూతులు కూడా తిట్టేవారు. కానీ ఏరోజూ అలాంటి వాటిపై సామాజిక మాధ్యమాల పోస్టుల ఆధారంగా బాబు హయాంలో అరెస్టులు చేయలేదు. వేల కిలోమీటర్ల పాదయాత్ర జగన్ ప్రశాంతంగా చేసుకున్నారు. కావల్సినపుడు ధర్నాలు చేసుకున్నారు. ఎక్కడో ఎమ్మార్వో, ఎమ్మెల్యే మధ్య ఘర్షణను ప్రభుత్వం మహిళలపై చేసిన దాడిగా చిత్రీకరించారు. బాబుది రాక్షస రాజ్యమని యూట్యూబులో తప్పుడు కథలు అల్లి బ్రహ్మాండం బద్దలైపోయినట్లు అరాచకం రాజ్యమేలుతున్నట్లు చిత్రీకరించారు. కట్ చేస్తే జగన్ అధికారంలోకి వచ్చారు. 

చంద్రబాబు ఏం చేసినా భయంతో వణికిపోతున్నారు. ప్రతిదానినీ అడ్డుకుంటుున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయ కార్యక్రమాలు చేసుకోనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు విశాఖ పర్యటన ఆధారంగా ఎంత కుతంత్రం పన్నారంటే... నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు తమ చొక్కాలపై పేర్లను తీసేశారు. ఎవరూ తెలుసుకుని గుర్తుపెట్టుకోకూడదు అని. దీనిపై నెటిజన్లు పోలీసు శాఖను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు వారు పోలీసులో కాదో ఎలా నమ్మాలి. సినిమా ఆర్టిస్టుల్లా ఖాకీ చొక్కాలు వేసుకుని వస్తే ఎలా అంటూ పలువురు వ్యతిరేకించారు. అనుమతితో చేస్తున్న ర్యాలీని ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు? ఎందుకు అరెస్టు చేస్తున్నారు? ఏ సెక్షన్ ప్రకారం అరెస్టు చేస్తున్నారు?  అని చంద్రబాబు పోలీసులను నిలదీయగా... వాళ్లు నీళ్లు నమిలారు. దీంతో చంద్రబాబు పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. ఏం చేయాలో తెలియక అయోమయానికి గురైన పోలీసులు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి... చంద్రబాబు భద్రత కోసమే అరెస్టు చేస్తున్నట్లు సీన్ క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు చేసిన పని అందరిలో నవ్వులపాలయింది. చంద్రబాబు అరెస్టు చేయడానికి ఏ అధికార పత్రం తేలేదు. బాబు నిలదీయడంతో అప్పకప్పుడు తెల్లకాగితంపై ’’మీ భద్రత కోసమ మిమ్మల్ని సీఆర్పీసీ 151 సెక్షన్ ప్రకారం మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం‘‘ అంటూ రాసి ఒక పోలీసు అధికారి సంతకం పెట్టి అది చూపించారు. అంటే ఆ అరెస్టు వారెంటు రికార్డుల్లో ఉండదు. ఎందుకంటే అది లెటర్ హెడ్ కాదు. దానిపై సీల్ కూడా లేదు. దీంతో పోలీసులు తీరుపై తెలుగుదేశం నేతలు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. పోలీసులు ప్రభుత్వం చెప్పింది తప్పో ఒప్పో నిర్దారించుకోకుండా గుడ్డిగా ఫాలో అయ్యే బానిసల్లా ప్రవర్తిస్తున్నారు అంటూ తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. పోలీసులు కాగితంపై రాసిన ప్రెస్ నోట్ పై సోషల్ మీడియాలో భారీగా సెటైర్లు పడుతున్నారు. పిల్లలు రాసే సెలవు చీటీ దీనికంటే పద్ధతిగా ఉంటుందని కొందరంటే... ఆ కాగితం కూడా ఎందుకు? సిగరెట్ పాకెట్ పై రాసి ఇవ్వండి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు పర్యటనలో పోలీసుల వ్యవహారం  ఏపీ ప్రజల్లో అభాసుపాలైంది.