కరెంటు ఛార్జీలు: ఈ ట్విస్ట్ జగన్ ఊహించలేదు !

August 06, 2020

కరెంటు ఛార్జీల మోత : లాక్ డౌన్ లో గవర్నమెంటు పనితీరులో డొల్లతనం బయటపడింది. ఒక పద్ధతి, ప్రణాళిక లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు నరకం చూపించాయి. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ప్రజల్ని వేధించారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయితే.... సందు దొరికితే చాలు జనం మీద ఫీజులు, ఛార్జీలు బాదుతున్నాడు. 

తాజాగా ఏప్రిల్ నెలలో తీయాల్సిన కరెంటు బిల్లులు విద్యుత్ ఉద్యోగులు తీయలేదు. దీంతో 75 యూనిట్ల లోపు కరెంటు వాడే పేదలకు ఉచితంగా దక్కే విద్యుత్తు దక్కకుండా పోయింది. గవర్నమెంటు ఏం చేసిందంటే... ఉద్యోగులు రాలేకపోయారు. మేలో వచ్చి అన్ని యూనిట్లు లెక్క తీసి ఒకే బిల్లు వేశారు.  రెండు నెలలకు రెండు బిల్లలు ఇవ్వాలన్న చిన్న లాజిక్ ను గవర్నమెంటు విస్మరించింది. ఏకధాటిగా అన్ని యూనిట్లకు కలిపి ఒకే బిల్లును ఇచ్చారు.

ఇలా ఒకే బిల్లును ఇవ్వడం వల్ల ఏపీలో నిత్యం తక్కువ శ్లాబుల్లో ఉండి బిల్లు మినహాయింపు పొందే పేదలు, తక్కువ యూనిట్లు వాడి తక్కువ శ్లాబులో చిన్నచిన్న బిల్లులు కట్టేవారికి ఒకేసారి ఛార్జీలు రెట్టింపై శ్లాబులు మారిపోయాయి.

అసలు వీటి గురించి ఏమాత్రం ఉన్నతాధికారుల్లో గాని పాలకుల్లో గాని ఒక సమీక్ష కూడా జరపకపోవడం వల్ల ప్రజలపై తీవ్ర భారం పడింది. పాలకులు చిన్న కామన్ సెన్స్ మిస్సయ్యి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేయడమే కాదు, వారిపై తీవ్ర భారం మోపారు. 

గ్రామగ్రామాన.. జగన్ పై జనం దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికే బస్సు ఛార్జీలు, పెట్రోలు ఛార్జీలు, మద్యం రేట్లు, విద్యుత్ ఛార్జీలు పెంచడంతో తీవ్ర కోపంగా ఉన్న జనం... ఈ శ్లాబుల గోలతో మంటెక్కిపోయారు. జనం గురించి కనీసం ఆలోచించడానికి టైం లేదా ఈ ముఖ్యమంత్రికి... కూలీనాలీ లేదు. తినడానికే ఇబ్బంది పడుతున్న మేము ఇంత పెద్ద బిల్లులు డబ్బులు ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలి అని ప్రశ్నిస్తున్నారు.