CRDA : రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం !

August 10, 2020

నిమ్మగడ్డ విషయంలో వెనుకడుగు వేయాల్సి వచ్చినందుకు అవమాన భారంతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అతిపెద్ద గుడ్ న్యూస్. సీఆర్డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ రెండు బిల్లులకు గవర్నర్ నుంచి ఆమోదం లభించింది.

ఈ బిల్లలు మొదటి సారి ప్రవేశపెట్టినపుడు అవి సెలెక్ట్ కమిటీకి వెళ్లి పెండింగ్ లో ఉన్నాయి. దీంతో రెండోసారి ప్రవేశపెట్టిన అనంతరం గవర్నరుకు పంపించారు. వాటిని గవర్నరు తాజాగా ఆమోదించారు. అంటే జగన్ 3 రాజధానుల కల నెరవేరడానికి మొదటి మెట్టు పడింది.

కానీ ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు పోతే అక్కడ ఏం జరగుతుందన్నది ఇపుడు ఆసక్తికరం. అమరావతి రైతులకు ఎలా న్యాయం చేస్తారు? వారి పరిస్థితి ఏమిటి? వారు కోర్టుకు వెళతారా? రాజీ పడతారా? ఇవన్నీ ఇపుడు పెద్ద ప్రశ్నలు.