సంచలన జీవో... నిమ్మగడ్డే ఏపీ ఎన్నికల ముఖ్యఅధికారి 

August 08, 2020

రాజ్యాంగం అతిక్రమిస్తే అవమానాలు తప్పవు. మెజారిటీతో సంబంధం లేదు. బలంతో సంబంధం లేదు. మందీమార్బలంతో సంబంధం లేదు. ఈ దేశంలో రాజ్యాంగమే సుప్రీం. ఎన్నికల్లో ఓటేసిన కోటిన్నర కాదు...  5 కోట్ల ప్రజలు జగన్ కే జై కొట్టినా... జనం మాట కాదు, రాజ్యాంగం మాటే గెలుస్తుంది. అది నిమ్మగడ్డ అయినా, ఇంగ్లిష్ మీడియం అయినా... రంగుల కల అయినా!!

సుప్రీం కోర్టు చెడామడా చీవాట్లు పెట్టాక కూడా 6 రోజులు అయినా ఆపుదాం అన్న పిల్లాడి మనస్తత్వంతో వ్యవహరించిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా నియమించింది. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పునర్నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

 

హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమిస్తున్నట్టు పంచాయతీ రాజ్ శాఖ నుంచి గవర్నర్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. శుక్రవాం లోపు ఉత్తర్వులు ఇవ్వాల్సిందే అని ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశించడంతో అర్ధరాత్రికి  కొద్దిసేపటి ముందు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. 

 

రాజ్యాంగంపై అవగాహన లేకపోతే ముఖ్యమంత్రి అయినా... ఒక రిటైర్డ్ ఐఏఎస్ చేసిన పోరాటంలో ఓడిపోక తప్పదు అని నిరూపించిన ఘటన ఇది.