కోర్టులపై స్పీకర్ తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు

August 03, 2020

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వ పాలసీలలో కోర్టుల జోక్యం దారుణం అని ఇది ఇది ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబడడమే అని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం... శాసన, కార్యనిర్వహక, న్యాయవ్యవస్థలు దేనికవే స్వతంత్రం అని.. ఒక వ్యవస్థలోకి ఇంకో వ్యవస్థ చొరబడటాన్ని ఆయన తప్పు పట్టారు.

న్యాయ వ్యవస్థ జోక్యం ఇలాగే కొనసాగితే ఇక ఎన్నికలు ఎందుకు, ఎమ్మెల్యేలు కావడం ఎందుకు అని ప్రశ్నించారు. కోర్టులే ఆపమని అన్నిటిని నిర్దేశిస్తుంటే... ఇక ఈ వ్యవస్థలు ఎందుకు... న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని నడిపిస్తాయా అని ఆయన నిలదీశారు.

బాధతోనే కోర్టు తీర్పులు అంగీకరిస్తున్నాము అని వెల్లడించారు.  మేధావులు దీనిపై  చర్చించాలి అని ఆయన పిలుపునిచ్చారు.  మా నిర్ణయాలు తప్పైతే గెలిపించిన ప్రజలే మళ్లీ ఓడిస్తారు. రాజ్యాంగాన్ని గౌరవించి ముందుకు వెళుతున్నాము అని తమ్మినేని సీతారాం అన్నారు.

మనీ బిల్లును ఆపడం రాజకీయాల్లో వికృత చేష్టలకు పరాకాష్ట... నా రాజకీయ జీవితంలో ఇలాంటిది చూడలేదు. అయితే... మనీ బిల్లును ప్రవేశపెట్టకుండా వేరే బిల్లును ప్రవేశపెట్టి... తప్పు చేసింది గవర్నమెంటే అని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఆరోజు అప్రాప్రియేషన్ బిల్లు ప్రవేశపెట్టకుండా శాసనమండలిలో వేరే బిల్లు ప్రవేశపెట్టారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ప్రభుత్వ వాదన ఇంకోలా ఉంది.