ఎన్నారై రత్నాకర్ కు పదవిచ్చిన జగన్

August 14, 2020

జగన్ పదవుల పంపకం ఇంకా కొనసాగుతూ ఉంది. ఎవరి విమర్శలు పట్టించుకోకుండా తనకు మంచిది అనిపించిన పనిని జగన్ అలా చేసుకుంటూ పోతున్నారు. వాటిలో నియామకాలు కూడా ఒకటి. అమెరికా పర్యటనకు వెళ్లే ముందు ఏపీ ఎన్నార్టీ ఛైర్మన్ గా మేడపాటి వెంకట్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక జగన్ మరో ఎన్నారైకి పదవి ఇచ్చారు. అమెరికాలో ఏపీ ప్రభుత్వ వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్ ను నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రవాసాంధ్రుల్లో రత్నాకర్ పండుగాయల సుపరిచితుడు.
చాలాకాలం నుంచి రత్నాకర్ వైసీపీ ఫాలోయర్. ఆయన గతంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబును కూడా పలుమార్లు విమర్శించారు. తాజా అమెరికా పర్యటనలో జగన్ తనను కలిసిన రత్నాకర్ తో ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారట. అమెరికా నుంచి పెట్టుబడిదారులతో ఏపీకి తేవడం, వారికి సహకారం అందించడం... ఎన్నారైల పెట్టబడులను ఆకర్షించడం ఈ బాధ్యతల్లో ఒకటి. అలాగే ఏపీ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దల పర్యటనల వ్యవహారాలు కూడా చూసే పోస్టు ఇది.