జగన్ గుట్టు రట్టు చేసిన తెలంగాణ మంత్రి

June 05, 2020

అవును... ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి అత్యంత ప్రీతిపాత్రమైన తెలంగణ ప్రభుత్వంలోని మంత్రే ఆయన పరువు తీశారు. అది కూడా మీడియా ముఖంగా ఏపీ ముఖ్యమంత్రి వైఫల్యాన్ని పేర్కొనడం విశేషం. ఇదెపుడు జరిగింది అంటారా... కరోనా తాజా అప్ డేట్స్ చెప్పడానికి మీడియా ముందుకు వచ్చిన మంత్రి ఈటల రాజేంద్ర కరోనాను అదుపు చేయడంలో తాము కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. లాక్ డౌన్ ను మేము కనుక నిర్లక్ష్యం చేసి ఉంటే.. పరిస్థితి పక్క రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు జిల్లాలాగ ఉండేదని ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలకు మంట పుట్టించాయి. అంటే ... అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ను నిర్లక్ష్యం చేయడం వల్లే కరోనా వ్యాప్తి చెందింది అని చాాలాకాలంగా తెలుగుదేశం నేతలు చేస్తున్న ఆరోపణలు పచ్చినిజాలు అని ఈటెల చెప్పినట్లయ్యింది.

 

వాస్తవం కూడా అదే. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు విచ్చలవిడిగా అనుచరులను వేసుకుని తిరుగుతూ దానధర్మాలు చేయడాన్ని ఒక ఎన్నికల ప్రచారంలా నిర్వహించారు. దీంతో చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే నిర్వాకానికి అప్పనంగా బలైంది. మరోవైపు నగరి రోజా కూడా లాక్ డౌన్ నిబంధనలు ఎక్కడా పాటించలేదు. తప్పు ఎత్తిచూపిన వారిపై ఎదురుదాడి చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య కూడా తానేం తక్కువ అన్నట్టు మరో ర్యాలీ తీశారు. ఒక అవంతి, ఒక తమ్మినేని, ఒక సాయిరెడ్డి... ఒకరేటిమి ఎవరి స్థాయిలో వారు తమ సత్తా చాటుకోవడానికి లాక్ డౌన్ ను తుంగలో తొక్కారు. ఏపీని రెడ్ జోన్లో పడేశారు. వీరి నిర్వాకంతో కరోనా కేసులు గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్నాయి ఏపీలో. కర్నూలు కేసులకు పూర్తి కారణం స్థానిక ఎమ్మెల్యే అని కర్నూలులో టాక్ నడుస్తోంది.

 

ఇక తెలంగాణలో ఈరోజు కొత్త కేసులు 6 మాత్రమే వచ్చాయని ఈటెల వెల్లడించారు. నిన్న ఒక్కరోజు భయపెట్టినా... ఈరోజు మళ్లీ సింగిల్ డిజిట్ కి పడిపోయాయి. మరణాలు శూన్యం. మొత్తం కేసులు 1044కి చేరాయి. ఈ కేసుల్లో 90 శాతం కేసులు మర్కజ్ కాంటాక్టులే అని ఈటెల పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎలా సోకిందో తెలియని కేసులు కేవలం 22 మాత్రమే ఉన్నాయని... వాటి సోర్సు కూడా త్వరలో ట్రేస్ చేస్తామని ఈటెల చెప్పారు.  ఈరోజు మరో 22 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 464కి పెరిగింది. యాక్టివ్ కేసులు 552గా ఉన్నాయి. కేంద్రం చెప్పిన ప్రకారం తెలంగాణలో కూడా సడలింపులు ఉంటాయని ఈటెల పేర్కొన్నారు.