ట్విట్టరులో దుమ్మురేపుతున్న జగన్ 

May 28, 2020

జగన్ ప్రెస్ మీట్లు పెట్టకుండా తెలుగు ప్రజలను తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్ తెలుగు ప్రజలను కేసీఆర్ కంటే ఎక్కువ ఆకట్టుకుంటోంది ఈ మధ్య. ఆయన చెప్పే మ్యాథమ్యాటిక్స్, మెడిసిన్, ఫిజిక్స్, సోషల్ సైన్స్ అబ్బ ఏం చెప్పినా ఓ రేంజ్, ఓ క్వాలిటీ ఉంటుంది. కానీ చివరి రెండు సార్లు ఇవేమీ లేకుండా ఒక డాక్యుమెంటరీలాగా రెండు రికార్డెడ్ వీడియోలు విడుదల చేయడంతో తెలుగు ప్రజలు నిరాశ చెందారు. తాజాగా బహు శాస్త్ర సాంకేతిక నిపుణుడైన జగన్ ట్విట్టరులో దుమ్ము రేపుతున్నారు... #ApCMTughluqRule గా వేల ట్వీట్లతో ట్రెండవుతూ తనకు తిరుగులేదు అని నిరూపించారు.

 

వాటిలో కొన్ని ఎంపిక చేసిన ట్వీట్స్ మీకోసం

ట్వీట్ 1

పార్టీ రంగులు - హైకోర్టు చెంపదెబ్బ

మూడు రాజధానుల్లో భాగంగా జుడీషియల్ బాడీ షిప్ట్ - హైకోర్టు చెంపదెబ్బ

తెలుగు మీడియం తొలగింపు - హైకోర్టు చెంపదెబ్బ

స్థానిక ఎన్నికల వాయిదా పిటిషను - హైకోర్టు, సుప్రీంకోర్టు చెంపదెబ్బ

చప్పట్లు, చప్పట్లు 

 

ట్వీట్ 2

Our CM is trying his level best to make ANDHRA PRADESH AS CORONANDHRA PRADESH

 
ట్వీట్ 3

మనం సీఎం ఏం చేశాడు

ఈసీనీ సస్పెండు

నగర కమిషనర్ ని సస్పెండ్ చేశారు

మాస్కు అడిగిన డాక్టర్ ని సస్పెండ్ చేశారు

లాక్ డౌన్ ని కూడా రద్దు చేయాలంటాడు

 

ట్వీట్ 4

CM's to PM Delhi CM -Extend Lockdown Maharastra CM -Extend Lockdown Telangana CM -Extend Lockdown Chhattisgarh CM -Extend Lockdown West Bengal CM -Extend Lockdown EVM CM - Conduct Elections

 

ఇంకా చాలా ట్రోలింగ్ ఉంది. అయినా 20 వేల ట్వీట్స్ నుంచి ఏరుకోవడం మన చేతనవుతుందా చెప్పండి. ఆయనకు ఉన్న ప్రజాదరణ అసామాన్యం. సీఎం పోస్టులో కూర్చుని ప్రధాని చేయగలిగిన పనులు కూడా చేయగలిగిన సమర్థులు. కింద స్లైడ్ షోలో మరిన్ని సోషల్ మీడియా విమర్శలు చూడొచ్చు.