ఆక్లైమ్, ఏపీఎన్నార్టీ కృషి అద్భుతం ఇది

August 08, 2020
  • 25 మంది ఏపీ ఉపాధ్యాయుల‌కు విదేశీ ఉద్యోగ అవ‌కాశం

ఆక్లైమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఏపీఎన్ఆర్‌టీ కృషి ఫ‌లితంగా 25 మంది ఏపీ ఉపాధ్యాయుల‌కు విదేశీ ఉద్యోగ అవ‌కాశం సాధ్య‌మైంది. అమెరికాలోని స్టార్ టెక్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఆక్లైమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత రవి శాఖమూరి, ఏపీఎన్‌ఆర్‌టీతో కలసి కుదుర్చుకున్న ఒప్పందం ఫ‌లితంగా అమెరికాలో ఉద్యోగ అవ‌కాశం ద‌క్కింది. పదినెలల పని కాలానికి 53,000 వేల నుండి 60,000 వేల అమెరికన్ డాలర్లు పొందే అవకాశం ఉంది.

ఎక్ట‌ర్ కౌంటీ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ (Ector County Independent School District)లో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్న నేప‌థ్యంలో ఏపీలోని వారికి అవ‌కాశం కోసం ఈ రెండు సంస్థ‌లు కృషి చేశాయి. ప్రత్యేక పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా వడపోసి 25 మందిని ఎంపిక చేశారు. 10 మంది గణిత ఉపాధ్యాయులు, ఇద్దరు సైన్స్ ఉపాధ్యాయులు, 13మంది ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు ఈ స్కూల్‌లో అవ‌కాశం ద‌క్కింది. వీరంతా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వారు. అమెరికాలో వీరు 2019 ఆగస్తు నుంచి పని చేయనున్నారు. ఈ ఉపాధ్యాయులు ఒక సంవత్సర కాల ఒప్పందంతో ఉద్యోగాలు పొందారు.

Ector County Independent School District పాఠశాలలో పనిచేయుటకు J1 వీసా ద్వారా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. J1 వీసా కొరకు అయ్యే ఖర్చులను సగానికి పైగా వ్యయాన్ని సంబంధిత స్కూలు భరిస్తుంది. జే1 వీసా ద్వారా వీరికి మూడు సంవత్సరాలు అమెరికాలో ఉండే అవకాశం ఉంది. అదనంగా మరో రెండు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. విదేశాలకు వెళ్లబోయే ముందు ఈ ఉపాధ్యాయులకు ఏపీఎన్‌ఆర్‌టీ ముఖ్య కార్యాలయంలో ఏడు రోజుల ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీని ద్వారా అమెరికాలో వినియోగించే భోధనా పద్ధతులు, పాఠ్యప్రణాళికలు, ప్రోటోకాల్స్, నియమ నిబంధనల పై అవగాహన కల్పించబడుతుంది. టెక్సాస్ లోని ఏపీఎన్‌ఆర్‌టి కమ్యూనిటి వృత్తిపరమైన మద్దతును వీరికి ఇస్తుంది. ఎంపికైన ఉపాధ్యాయులకు ఏపీఎన్‌ఆర్‌టీ ఉచిత వీసా సంప్రదింపుల సౌకర్యాన్ని అందిస్తుంది. ఎంపికైన ఉపాధ్యాయులు ఎటువంటి రుసుములు చెల్లించకుండా వారి ప్రతిభా పాటవాలతోనే ఎంపికయ్యారు. మరిన్ని వివరాలకు సీనియర్ఆపరేషన్స్ మేనేజర్ ఏకేజిలానీని 9491672132 నంబ‌రులో సంప్రదించవచ్చు.