అబద్ధానికి వేగం ఎక్కువ - ఏపీఎన్ఆర్‌టీ

September 17, 2019

ప‌నిగ‌ట్టుకొని ప‌ది మంది చేసే ప్ర‌చారానికి ఆదిలోనే చెక్ పెట్ట‌క‌పోతే...అదే నిజ‌మ‌నుకొని ప్ర‌జ‌లు భ్ర‌మ‌ప‌డే ప్ర‌మాదం ఉంది. ఇలాంటి ప‌రిస్థితిలోనే..ఏపీ ఎన్నార్టీఎస్ వివ‌ర‌ణ ఇచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి నిధులు లాగేశారు..సీఆర్డీఏ భూములు సొంతం చేసుకున్నారు...నిధులు జేబులో వేసుకున్నారు అంటూ గ‌త కొద్దికాలంగా దురుద్దేశ‌పూర్వ‌క రాజ‌కీయాల్లో భాగంగా ఏపీ ఎన్నార్టీఎస్‌పై జ‌రుగుతున్న చెడు ప్ర‌చారంపై గ‌ణాంకాల‌తో స‌హా స‌వివ‌ర‌ణ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఏ ఏ అంశాల్లో ఎంతెంత ఖ‌ర్చు అయింది, బ‌దులుగా ద‌క్కిన ప్రయోజ‌నం ఏంట‌ని వివ‌రించింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు అన్ని ప్ర‌ధాన దేశాల్లో ఉన్న తెలుగువారి సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఏపీ ఎన్నార్టీఎస్ ఈ క్ర‌మంలో వారి బాగోగుల‌తో పాటుగా అనేక‌మంది ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించింది. ఇందుకోసం అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసింది. వివిధ దేశాల్లో చిక్కుకొని పోయిన కార్మికులు, ఉద్యోగుల‌ను స్వ‌దేశానికి ర‌ప్పించడంలో ఏపీఎన్నార్టీఎస్ విశేష కృషి చేసింది. వీటిన్నింటినీ పేర్కొంటూ...ఈ అంశాల‌ను ప‌క్క‌న‌పెట్టి విమ‌ర్శ‌లు చేయ‌డంపై ప్ర‌శ్నించింది. త‌ప్పు చేస్తే..ఏపీఎన్నార్టీఎస్ వారిని నిల‌దీయాల‌ని స్ప‌ష్టం చేస్తూనే...రాజ‌కీయాల కోసం రాష్ట్ర భ‌విష్య‌త్ పణంగా పెట్ట‌వ‌ద్ద‌ని విన‌మ్రంగా కోరింది. ఇదే ఏపీ ఎన్నార్టీఎస్ ప్ర‌క‌ట‌న.