ఏపీఎన్ఆర్టీ మాజీ అధ్య‌క్షులు వేమూరి ర‌వి ఆధ్వ‌ర్యంలో ఎన్ఆర్ఐ హాస్ప‌టల్ కు పీపీఈ కిట్లు పంపిణీ 

June 06, 2020

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు 70వ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేపట్టారు. ఏపీ ఎన్ఆర్టీ మాజీ అధ్య‌క్షులు వేమూరి ర‌వి ఆధ్వ‌ర్యంలో ఎన్ఆర్ఐ హాస్ప‌టల్ కు 500 పీపీఈ కిట్లు, సిదార్ధ హాస్ప‌ట‌ల్ కు 400 కిట్లు, డిజిపి కార్యాల‌యానికి 50వేల మాస్కులు పంపిణీ చేశారు. క‌రోనా మ‌హామ్మారి నుంచి ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడేందుకు కృషి చేస్తున్న డాక్టర్లు, పోలీసుల‌కు త‌మ వంతు సాయం అందించాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో కే. బుచ్చిరామ్ ప్ర‌సాద్, డా. ఎన్. ముర‌ళీతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.