మాట తిప్పేసిన జగన్ - 6 వేల మంది అవుట్

August 08, 2020

చంద్రబాబు కాంట్రాక్టు ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. తాను సీఎం అయ్యాక కాంట్రాక్టు ఉద్యోగులందరినీ వారి అర్హతలను బట్టి పర్మనెంట్ చేస్తానని జగన్ హామీ ఇచ్చిన విషయం మీకు గుర్తుందా? గుర్తు లేకపోతే ఈ వీడియోలో 1.30 నిమిషాల తర్వాత జగన్ మాట్లాడింది వినండి. తర్వాత వీడియో కింద మ్యాటర్ చదవండి.

 

ఇప్పటికే మీ సేవలో ఉద్యోగులందరినీ జగన్ పీకేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్టీసీలో 6 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మీరు ఇక డ్యూటీకి రావక్కర్లేదంటూ ఏపీ ఆర్టీసీ ఆదేశాలు జారీచేసింది. పైనేమో జగన్ సీఎం అయ్యాక అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. వాస్తవానికి పై వీడియోలో జగన్ చెప్పిన ఏ పని చేయలేదు. ఏ హామీ నెరవేర్చలేదు. 

బస్సులను పరిమిత సంఖ్యలోనే నడపాలని ఏపీ ఆర్టీసీ నిర్ణయించుకున్న నేపథ్యంలో తక్కువ బస్సులు నడపడం ద్వారా మిగిలిన డ్రైవర్లకు, కండక్టర్లకు ఉత్తినే జీతాలు ఇవ్వాల్సిన పరిస్ధితి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని తొలగిస్తే అదనంగా ఉన్న ఉద్యోగులను అక్క డ సర్దుబాటు చేయొచ్చని భావించిన జగన్ సర్కారు...  దాదాపు 6 వేల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని పీకేసింది. ఇప్పటికే వీరు డ్యూటీ లేక ఇళ్ల వద్ద ఉంటున్నారు. ఇక మీరు విధులకు రావాల్సిన అవసరం లేదని డిపో మేనేజర్లు ఆదేశాలు ఇచ్చారట వారికి. 

జగన్ మాట తప్పడు, మడప తిప్పడు.. అని జరుగుతున్న ప్రచారానికి ఇది విరుద్ధంగా ఉంది కదా?!