ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయి, ఇదిగో సాక్ష్యం

August 07, 2020

ఆర్టీసీ ఛార్జీల భారం భరించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలి.  ఆంధ్రా, తెలంగాణలో కచ్చితంగా త్వరలో పెరుగుతాయి. ఇప్పటికే ఒకసారి పెంచారు కాబట్టి పెంచడం రెండు నెలలు ఆలస్యం కావచ్చు. కానీ పెంచడం మాత్రం గ్యారంటీ?

అదేంటి జగన్ అన్న పెంచను అని చెప్పారు అనుకుంటున్నారా... ఎన్నికల ముందు కూడా చంద్రబాబు చార్జీలు బాదుతాడు అని చెప్పి అధికారంలోకి వచ్చాక ఎన్నో ఛార్జీలు పెంచారు సీఎం జగన్. పైగా తాను వ్యతిరేకించిన ఛార్జీలే పెంచాడు. కరెంటు, పెట్రోలుపై ఛార్జీ ఇవన్నీ జగన్ గతంలో వ్యతిరేకించి అధికారంలోకి వచ్చాక పెంచారు. అలాంటపుడు ఇపుడు మళ్లీ పెంచడని మీరు భరోసా ఎలా ఫీలవుతారు.

పెంచుతారు అని అంత నమ్మకం ఏంటి అనుకుంటున్నారా? కింద ఉన్న ఫొటో చూడండి. బస్సులు మార్చిన విధానం చూశారుగా. సీటుకి సీటుకి ఎడం పెట్టారు. గతంలో 4 సీట్లున్నచోట ఇపుడు మూడే ఉన్నాయి. మరి కోత పడిన ఆ నాలుగో సీటు ఖర్చు మీరు భరించక జగన్ భరిస్తాడా? ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఛార్జీలు పెంచకపోతే ఇంకా నష్టాల్లోకి పోతుంది. 

ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని పంచాయతీ ఎన్నికలయ్యే వరకు పెంచకపోవచ్చు. కానీ ఆ తర్వాత అయినా ఛార్జీలు పెంచడం అనేది గ్యారంటీ ఇపటి నుంచే మానసికంగా సిద్ధం కావల్సిందే. తెలంగాణలోను అంతే.. ఛార్జీల బాదుడు గ్యారంటీ. అంటే ప్రజలను కాపాడం కోసం ప్రభుత్వం కష్టపడటం ఒట్టిదే. అంతా ప్రజలకే బొక్క.