స్వర్గం చూడ్డానికి స్పెషల్ రైల్ !! ఎక్కడో కాదు ఏపీలోనే !!

August 07, 2020

స్వర్గానికి ట్రైనా? ఓవర్ యాక్షన్ చేస్తున్నాం అనుకోవద్దు. ప్రతి ఏడాది అక్టోబరు 1 నుంచి డిసెంబరు 30 వరకు అరకును చూసే వాళ్లు అదృష్టవంతులే. ఆ వాతావరణం, ఆ పచ్చదనం, లోయలు, కొండలు, తేయాకు తోటలు... కదిలే మేఘాలు ఇవన్నీ స్వర్గంలో విహరిస్తున్నట్టే ఉంటాయి. ముఖ్యంగా వైజాగ్ నుంచి అరకు రైలు ప్రయాణమే ఒక గొప్ప అనుభూతి. దానికోసం అందరూ ఎగబడతారు. ఆ అదృష్టాన్ని మరింత మందికి పంచడానికి రైల్వే శాఖ సిద్ధమైంది. 

అరకు టూరిస్టుల కోసం అక్టోబరు 1 నుంచి ప్రత్యేక రైలు వేశారు. ఈ రైలు నెంబరు 08517. గూగుల్ లో దీని వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. ప్రతి రోజు వైజాగ్ నుంచి ఉదయం 8.10 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు అరకు చేరుకునే ఈ ట్రైన్ తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు విశాఖకు వచ్చేస్తుంది. ఈ ప్రయాణం గొప్పగా ఉంటుంది. ఇప్పటికే ఈ రూట్లో ట్రైన్ ఉన్నా కూడా... ఇది అరకు సీజన్ కావడం వల్ల అదనపు ట్రైను వేశారు. 

ఛార్జీలు కూడా తక్కువే. స్లీపర్ 230, థర్డ్ ఏసీ 755, సెకండ్ ఏసీ 1015 ఉంటాయి. వైజాగ్ అరకు మధ్య ఇది ఆగే స్టేషన్లు సింహాచలం, కొత్తవలస, బొర్రా గుహలు. మొత్తానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ స్వర్గానికి రైలు వేసిందన్నమాట. మీరు సిద్ధమేనా మరి చూడటానికి.