జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్?

August 07, 2020

ప్రముఖ సీనియర్ నటి కమ్ మాజీ ఎంపీ జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. రాంపూర్ కోర్టు నుంచి జారీ అయిన ఈ వారెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆమె రాంపూర్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే.. సమాజ్ వాదీ అభ్యర్థి ఆజంఖాన్ చేతిలో ఆమె ఓడిపోయారు. వాస్తవానికి ఈ ఎన్నిక పోటాపోటీగా సాగింది.
ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల సందర్భంగా ఆమె ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లుగా పోలీసులు కేసు పెట్టారు. దీనికి సంబంధించిన కేసు విచారణ తాజాగా కోర్టుకు వచ్చింది. జయప్రదపై నమోదైన మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ఉల్లంఘన కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 20కు వాయిదా వేశారు. సదరు ఎన్నికల్లో లక్ష ఓట్ల తేడాతో ఓడిన జయప్రద.. తాజాగా తనకు జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ కు ఎలా రియాక్ట్ అవుతారో?