అ​య్యెయ్యో! హీరో అవుదామనుకున్న అసుదుద్దీన్ జీరో అయ్యాడే !

August 07, 2020

​ట్విట్టరులో నిన్న ఒకటి ట్రెండ్ అయ్యింది..​. అదేంటో తెలుసా #Tabligiheroes అని. అదేంటి అసలు దేశంలో ఇన్ని కేసులున్నదే తబ్లిగి వల్ల అంటున్నారు, పైగా దాని అధ్యక్షుడు మౌలానా సాద్ అరెస్టు చేయబోతున్నారు. తబ్లిగి హీరోస్ అని ఎందుకు ట్రెండయ్యింది అనుకుంటున్నారా... ప్లాస్మా చికిత్స కరోనా లో సత్ఫలితాలను ఇస్తోందని వార్తలు రావడంతో... లోపల ఏం జరుగుతుందో తెలియకుండానే కొందరు తబ్లిగీలే ప్రాణాలు కాపాడుతున్నారు చూశారా? అంటూ తబ్లిగి హీరోస్ అని ట్రెండ్ చేశారు. దీనిని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని ప్లానేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్... గరవ్నమెంటుకు ఈరోజు ఒక పెద్ద లేఖ రాశారు. అయ్యా ప్లాస్మా చికిత్సకు ప్లాస్మా ఇవ్వడానికి ఎవరూ ఒప్పుకోవడం లేదట. ఇదిగో మా వాళ్లు 32 మందిని ఒప్పించాను. ప్లాస్మా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు... చూశారో మేము ఎంత మంచి వాళ్లమో అన్నట్లు లేఖ రాసి తెగ హడావుడి చేశారు. 

కట్ చేస్తే... అసద్ తో పాటు ఇపుడు కేటీఆర్ కూడా బుక్ అయ్యేలా ఉన్నాడు.
కొద్ది సేపటి క్రితం కేంద్ర ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన చేసింది. ప్లాస్మా చికిత్స విధానాన్ని అనుసరించడం కరోనా బాధితుడికి ప్రమాదకరమని, అంతేకాకుండా చట్ట విరుద్ధమని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఇదింకా నిరూపిత విధానం కాదని, ప్రయోగదశలోనే ఉందని ఆయన స్పష్టంచేశారు. కరోనా బాధితుడికి ప్లాస్మా థెరపీని సరైన మార్గదర్శకాలు పాటించకుండా అందిస్తే అతని ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని లవ్ అగర్వాల్ హెచ్చరించారు. 

అంటే, తబ్లిగీల ప్లాస్మా వల్ల మళ్లీ ఇంకో ప్రమాదమే గాని ఉపయోగం లేదన్నమాట. తబ్లిగీలో మరో విపత్తుకు కారణమయ్యే నేపథ్యంలో కేంద్రం విజయవంతంగా అడ్డుకుంది. లేకపోతే అసద్ మాట విని చికిత్స చేసి ఉంటే ఏం జరిగేదో మరి. 

కేంద్రం ప్రకటనతో హీరో అవుదామని అసద్ చేసిన ప్రకటన ఓ రేంజ్ లో బ్యాక్ ఫైర్ అయ్యింది. దీంతో హీరో కావడం పక్కన పెడితే జీరో అయ్యాడు అసదుద్దీన్.