ఓవైసీ...ఇంత‌గా కేసీఆర్‌ను మోయ‌డం వెనుక రహస్యం?

May 31, 2020

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, హైద‌రాబాద్ ఎంపీ-ఎంఐఎం పార్టీ అధ్య‌క్షుడు అస‌దుద్దీన్ ఓవైసీ మ‌ధ్య ఉన్న దోస్తీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సంద‌ర్భం ఏదైనా ఈ ఇద్ద‌రు మిత్రులు ఒకే మాట‌పై ఉంటుంటారు. అయితే, తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ఓవైసీ ఓ రేంజ్‌లో పొగిడేశారు. అంతేకాకుండా ప్ర‌ధాని మోదీకి మంట పుట్టించేలా ఈ కామెంట్ ఉండ‌టం గ‌మ‌నార్హం.
వివ‌రాల్లోకి వెళితే...ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో  ఏడాది పాటు 30 శాతం కోత విధించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు కూడా తమ  వేతనంలో 30శాతం స్వచ్ఛందంగా వదులుకున్నారు. జీతాల్లో కోతకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మీడియాకు వివరించారు. దీనిపై ఓవైసీ త‌న‌దైన శైలిలో స్పందిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం పెద్ద గొప్పేమీ కాద‌న్నారు.
జీతాల్లో 30% కోత విధిస్తూ కేంద్రం ఇప్పుడు నిర్ణ‌యం తీసుకుంది కానీ...తెలంగాణ సీఎం కేసీఆర్ గ‌తంలోనే ఇలాంటి నిర్ణ‌యం తీసేసుకున్నార‌ని ప్ర‌క‌టించేశారు. చెప్పాలంటే కేసీఆర్ కేంద్రానికి మార్గ‌ద‌ర్శ‌కం చూపార‌ని కూడా...ఓవైసీ కితాబు ఇచ్చారు. సంక్షోభం స‌మ‌యంలో కూడా కేసీఆర్‌కు కితాబు ఇవ్వ‌డంలో, మోదీకి మంటి పుట్టించ‌డంలో ఓవైసీ బిజీగా ఉన్నాని ప‌లువురు చ‌ర్చింకుంటున్నారు. అయితే ఆయన ఇంతగా మోయడానికి కారణం కేంద్రం నుంచి మోడీ నుంచి తనను రక్షించగలిగిన ఏకైక వ్యక్తి కేసీఆరే. ఎందుకంటే కాంగ్రెస్ కి పవర్ లేదు. మోడీకి ఎదురు లేదు. అందుకే ఒవైసీకి కేసీఆర్ తప్ప వేరే దిక్కులేదు.