​జయలలిత, జగన్ ... వెరీ స్పెషల్ 

February 24, 2020

మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం నేత అశోకగజపతి రాజు చాలా అరుదుగా మీడియా ముందుకు వస్తారు. శ్రీమంతుల కుటుంబం నుంచి వచ్చినా సింప్లిసిటీ ఇష్టపడతారు. సాధారణంగా పదేపదే విమర్శలు చేయరు. అవసరమైనపుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి వెనుకాడరు. మంత్రిగా మంచి సంస్కరణలు తేగలిగారు రాజు గారు.

తాజాగా ఆయన విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో జగన్ పై విమర్శలు చేశారు.  ఏపీ ముఖ్యమంత్రుల్లో కేవలం ముఖ్యమంత్రి జగన్ కి మాత్రమే దక్కిన ఘనతను వెల్లడించారు. భారతదేశంలో ముఖ్యమంత్రి హోదాలో బోనులో నిలబడిన మొదటి వ్యక్తి దివంగత జయలలిత, రెండో వ్యక్తి ఏపీ సీఎం జగన్ అని రాజుగారు వ్యాఖ్యానించారు. కోర్టు బోనులో ముఖ్యమంత్రి నిలబడటం అంటే... ప్రజలు నిలబడినట్లే. జగన్ అలాంటి తప్పు చేసి రాష్ట్రానికి తలవంపులు తెచ్చారు. ఇది సిగ్గుచేటని గజపతిరాజు అన్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించే శక్తి ఎవరికీ లేదని చెప్పారు. ​గజపతి రాజు ఉత్తరాంధ్ర వ్యక్తే అయినా... అమరావతికే మద్దతు పలికారు. ​తల నొప్పి వస్తే ఎవరైనా మాత్ర వేసుకుం​టారు. కానీ తలతీసుకోరు. కానీ జగన్ తీసుకునే రకం అని విమర్శించారు.