హైదరాబాదులో ఆర్టీసీ పెట్రోల్ బంకులన్నీ కేసీఆర్ వియ్యంకుడివేనట

February 25, 2020

అనువు గాని సమయంలో అధికులం అనరాదు. కానీ కేసీఆర్ సరిగ్గా అలాంటి సమయంలో ఆర్టీసీని కెలికాడు. కేవలం కేసీఆర్ మొండి వైఖరి, తానే గెలవాలన్న ఇగో కారణంగా ఆర్టీసీ విషయంలో మొండికిపోయాడు. కానీ కేసీఆర్ ఊహించని స్థాయికి వెళ్లింది ఉద్యమం. ఎక్కడా బస్సులు తిరగక ప్రజలు ఇబ్బంది పడుతున్నా తమ ఇబ్బందులు పక్కన పెట్టి ప్రజలు ఆర్టీసీని తిట్టకుండా కేసీఆర్ ను తిట్టే పరిస్థితి కనిపిస్తోంది. 

ఆర్టీసీ సంఘాల జేఏసీ  ఛైర్మన్ అశ్వత్థామ రెడ్డి సమ్మెను విజయవంతంగా నడిపిస్తున్నారు. కేసీఆర్ సర్కారు స్కాములు, తప్పులను బట్టబయలు చేస్తున్నారు. అశ్వత్థామ రెడ్డి చొరవ కారణంగా అనేక సంఘాలు ఆర్టీసీకి మద్దతు పలికాయి. దీంతో శనివారం ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ క్ భారీ స్పందన వచ్చింది. జనం సహకరించడంతో రోడ్లన్నీనిర్మానుష్యంగా మారాయి. బంద్ సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. ఓ మీడియా అశ్వత్థామరెడ్డితో తాజాగా ఇంటర్వ్యూ చేయగా... ఆయన కేసీఆర్ కుటుంబం ఆర్టీసీనీ ఎలా వాడుకుంటుందో వివరించారు. ఆ వీడియో ఇంటర్వ్యూ ఇదే.