సీఎం ఊరికే దిక్కులేదు - 33 లక్షల మంది గాయబ్

August 14, 2020

ఈశాన్య రాష్ట్రం అసోంకి వరదలు కొత్త కాదు, కానీ రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కనీవినీ ఎరుగని నష్టాన్ని చూపిస్తున్నాయి. వాటి బీభత్సానికి రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. నీట మునిగిన గ్రామాల్లో అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ స్వగ్రామం బింధాకట కూడా ఉండటం గమనార్హం. 

ఈసారి భారీ ఎత్తున 33 లక్షల మంది ఈ వరదల్లో నిరాశ్రయలయ్యారు. ప్రజలు తిండి దొరక్క, తాగు నీరు అందక, కరెంటు లేక కకావికలమైపోయారు. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో అన్న సమాచారం కూడా లేదు. బుధవారం సాయంత్రానికి మొత్తం 66 మంది చనిపోయారు. 

మొత్తం 33 జిల్లాల్లో  27 జిల్లాలు నీట మునిగాయంటే అసోం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక  చర్యల్లో ముమ్మరంగా చేస్తున్నా... ఆ సేవలు చాలవు.

ఇక అతిపెద్ద  టైగర్ రిజర్వ్ కజిరంగా నేషనల్‌ పార్క్‌లో వందలాది జంతువులు మృతిచెందాయి. లక్షల ప్రాణులు ప్రమాదంలో పడ్డాయి. బ్రహ్మపుత్ర నదివల్ల ఈ వరదలు వచ్చాయి. దీంతో పాటు మొత్తం 8 నదులకు వరద రావడంతో ఈ ముప్పు వచ్చింది.