కోడెల... ఎందుకిలా?

February 25, 2020

ప్రభుత్వం మారింది. తెలుగుదేశం ప్రతిపక్షంలో కూర్చుంది. తెలుగుదేశంలో ఒక వ్యక్తిని ఆ పార్టీ విపరీతంగా టార్గెట్ చేసింది. ఆయన ఎవరు... కోడెల శివప్రసాద్ రావు. మొన్నటివరకు స్పీకర్ గా చేసిన ఆయనను ఎన్నికల ముందు అనేక ప్రాంతాల్లో చితకబాదారు. నాయకులపై విమర్శలు, బూతులు రావడం కామనే గానీ... ఇలా కొట్టడం అనేది చాలా అరుదు. కానీ జనం పలుమార్లు ఆయన్ను కొట్టారంటే... వ్యవహారం అనుమానాస్పదమే. ఇదిలా ఉంటే... ఆయనపై తాజా ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టిపెట్టింది. అదే సమయంలో తాము కోడెల బాధితులం అంటూ అనేకమంది వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కోడెల కుటుంబ సభ్యులు కూడ అరెస్టు కావడంతో పార్టీకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. మరోవైపు బినామీ పేర్లతో ట్యాక్సులు ఎగ్గొట్టి వ్యాపారాలు చేశారన్న కేసు కూడా నమోదైంది. వ్యవహారం ఇక్కడితో ఆగలేదు.
ప్రతిపక్ష పార్టీ వాళ్లు కేసు పెట్టారంటే ఏదోలే అనుకోవచ్చు... కానీ సొంత పార్టీ వాళ్లే, సొంత నియోజకవర్గంలో కోడెలతో కటీఫ్ చెప్పారు. సపరేట్ పార్టీ ఆఫీసు ఓపెన్ చేశారు. అధినేతకు కోడెల మాకొద్దు అని ఫిర్యాదు చేశారు. అటు ప్రత్యర్థి పార్టీ ఉక్కిరిబిక్కిరి చేయడం అంటే కక్ష అనుకోవచ్చు. సొంత పార్టీ నేతలు కూడా దూరం పెట్టడంతో కోడెలతో ఏదో తేడా ఉందని అందరిలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక పెద్ద షాక్ ఈరోజు జనాలకు తగిలింది.
అసెంబ్లీ ఫర్నీచర్ కోడెల ఇంట్లో ఉంది. ఏంటయ్యా అంటే... అవును, అపుడు అటు ఇటు సర్దుకునే క్రమంలో కొంత ఇంటికి వచ్చింది. అయితే, నేను లేఖలు రాశాను అసెంబ్లీ అధికారులకు. వారి నుంచి ఏ రిప్లయి రాలేదు. వెనక్కు ఇవ్వడానికి అయినా, డబ్బులు లెక్క కట్టి ఇవ్వడానికి అయినా సిద్ధమే అని కోడెల స్వయంగా ఒప్పుకున్నారు. ఒక స్పీకరు వంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి కేవలం ఇలా ఫర్నీచరు విషయంలో కకృతి పడటం అసలు పార్టీ కే మచ్చ తెచ్చింది. 2004 సమయంలో కోడెల కుటుంబంపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. కోడెల తప్పులు కోడెలను ఇరికిస్తే ఓకే... కానీ ఏకంగా పార్టీనే ఇబ్బంది పెడుతన్నాయి. పైగా అవన్నీ పరువు సమస్యులగా మారాయి. అయినా... ఒక స్పీకరు లేఖ రాస్తే అసెంబ్లీ సిబ్బంది స్పందించకపోవడంలో ఆంతర్యం ఏంటోజనానికి అర్థం కాదా? ఎందుకు ఇలా వ్యవహరించారు కోడెల?