జ్యోతిష్యుడి సంచలనం : యాంకర్ విడాకులు !

August 03, 2020

నమ్మకాలకు చింతకాయలు రాలినా.. రాలకున్నా.. దాని మీద ఉన్న ఆసక్తిని కొట్టిపారేయలేం. ఎవరైనా ఏమైనా ఫలానా జరుగుతుందంటే శ్రద్ధగా వినేటోళ్లకు కొదవ ఉండదు. ఈ అలవాటు సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు ఎక్కువే. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో తరచూ మీడియాలో కనిపించే జ్యోతిష్యుల్లో ఒకరు వేణుస్వామి. చాలా సందర్భాల్లో ఏదైనా సంచలన ఉదంతం చోటు చేసుకున్నప్పుడు.. ఆ విషయాన్ని తాము అప్పట్లోనే చెప్పామంటూ వారు చెబుతుంటారు.
ఇదిలా ఉంటే.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. పలువురు ప్రముఖులకు సంబంధించి వారి పేర్లు ప్రస్తావించకుండా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ హీరోయిన్ రాశీఖన్నా సుడి త్వరలో తిరిగిపోతుందని.. ఆమె నటించిన సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయని చెప్పారు. ఆమె జాతకం చాలా బాగుందన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోకు అనారోగ్యానికి గురవుతారని చెప్పారు. అయితే.. పేరు మాత్రం వెల్లడించలేదు.
అదే సమయంలో.. ఒక యువ రాజకీయనాయుకడు దారుణమైన ప్రమాదానికి గురి అవుతారని జోస్యం చెప్పారు. ఇవన్ని ఒక ఎత్తు అయితే.. త్వరలో ప్రముఖ యాంకర్ వ్యక్తిగత జీవితంలో సమస్యలు పక్కా అని చెప్పుకొచ్చారు. సదరు యాంకర్ కు.. ఆమె భర్తకు మధ్య విభేదాలు తప్పవని.. వారిద్దరూ విడిపోయే సూచనలు ఖాయమని చెప్పారు. ఈ అంచనాల్లో ఎన్ని నిజమవుతాయో.. మరెన్ని అబద్ధమవుతాయో తెలీదు కానీ.. ప్రస్తుతానికి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయని చెప్పక తప్పదు.