అచ్చెన్నాయుడు అరెస్టు బ్యాక్ ఫైర్ కానుందా?

August 14, 2020

ప్రజా ప్రతినిధులను అరెస్టు చేయాలంటే ముందు స్పీకరుకు నోటీసు ఇచ్చి ఆయన అనుమతితో మాత్రమే అరెస్టు చేయాలి. ఈ విషయంలో పోలీసులు నిబంధనలను ఉల్లంఘించినట్టు ఆరోపణలున్నాయి. 

సామాన్యుడు, పెద్దవాడు, ప్రజాప్రతినిధి అనే తేడా లేకుండా ఎవరికైనా అరెస్టుకు ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. తప్పించుకునే పారిపోయే కొన్ని కేసుల్లో మాత్రమే నేరుగా వెళ్లి చుట్టుముట్టి పట్టుకుంటారు.

కానీ అచ్చెన్నాయుడు ఒక ఎమ్మెల్యే. ఆయన నియోజకవర్గం విడిచిపోరు. పైగా ఆయనపై పెట్టిన కేసు కూడా అంత భారీ కేసు ఏం కాదు. ఈ నేపథ్యంలో వందల మంది పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేయాల్సిన అవసరం లేదు.

సుప్రీంకోర్టు ప్రకారం ఇది కోర్టి దిక్కరణ కిందకు వస్తుంది. ఇలాంటి కేసులకు సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తుంగలో తొక్కి అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. 

ఇపుడు అచ్చెన్నాయుడి తరఫున కోర్టుకు వెళితే ఆయన అక్రమ అరెస్టుకు బాధ్యులైన ఉన్నతాధికారులకు ముప్పుతప్పదు. అచ్చెన్నాయుడి అరెస్టు జగన్ కి, ఆయన ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదాలు తెచ్చే అవకాశం ఉందో ఒక న్యాయవాది ఈ వీడియోలో వివరించారు. చూడండి.