మ‌ద్యం సీసాల‌తో టీడీపీ మ‌హిళా నేత ఇంటిపై దాడి..కార‌ణం ఏంటి?

January 26, 2020

సంక్రాంతి పండుగ స‌మ‌యంలో...ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో క‌ల‌క‌లం రేగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వ‌ద్ద ఒకింత ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆమె ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సీసాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇంటి అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడి ఘ‌ట‌న గుర్తించిన కుటుంబ స‌భ్యులు దుండ‌గుల‌ను గుర్తించేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ....వారి ఆచూకి దొర‌క‌లేదు.
త‌మ ఇంటిపై జ‌రిగిన దాడి, దుండ‌గుల వివ‌రాలు ల‌భ్యం కాక‌పోవ‌డాన్ని పేర్కొంటూ సుగుణమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది. అయితే, పండుగ రోజు మ‌హిళా నేత నివాసంపై జ‌రిగిన దాడి క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. ఈ దాడి వెనుక రాజ‌కీయ సంబంధ‌మైన కార‌ణాలు ఉన్నాయా లేక ఆక‌తాయిలు పాల్ప‌డిన ఘ‌ట‌న అనేది పోలీసులు ఆరాతీస్తున్నారు.