మహిళా కండక్టరును దారుణంగా కొట్టిన యువకుడు

April 04, 2020

ఆర్టీసీ బస్సు ప్రజా ఆస్తే కానీ ఫ్రీ సర్వీసు కాదు. బస్సు ఎక్కిన ఓ ప్రయాణికుడిని టిక్కెట్ తీసుకోమని తన బాధ్యత నిర్వహించిన లేడీ కండకర్టును ఒక మూర్ఖుడు దారుణంగా కొట్టాడు. నలుగురి ముందు ఆమె దుస్తులను చించాడు. దీంతో ఆమె తీవ్రంగా రోధిస్తూనే అతని బారి నుంచి తప్పించుకుే ప్రయత్నం చేసింది. నిందితుడి పేరు శివారెడ్డి. అతను అలా ప్రవర్తించడంపై అందరూ షాకయ్యారు.  

చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనను గమనించిన స్థానికులు తోటి ప్రయాణికులు అతడ్ని అడ్డుకున్నారు.  ఆమె చొక్కాను పట్టుకుని, వదలకుండా పిడిగుద్దులు కురిపిస్తూ అతడిని ఆపి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. గుర్రంకొండ తరికొండల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మదనపల్లి డిపోకు చెందిన బస్సులో ఈ ఘటన జరిగింది. వారిద్దరి మధ్య ఏ గొడవ లేదు. టిక్కెట్ తీసుకోమని అడిగితే.. అవసరం లేదు అన్నాడు. ఫ్రీగా ప్రయాణించడం కుదరదు. కచ్చితంగా టిక్కెట్ తీసుకోమని లేడీ కండక్టరు చెప్పడంతో... శివారెడ్డి అనే ఆ వ్యక్తి ఆమె పై విచక్షణా రహితంగా దాడిచేశాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.