లండ‌న్‌లో భార‌తీయుల‌పై దాడి...అసలేం జరిగిందో తెలుసా?

August 08, 2020

లండన్‌లో భారత స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు నిర్వహిస్తుండగా...భారతీయులపై కొందరు పాక్ దేశస్తులు దాడి చేసిన సంఘ‌ట‌న ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. భారతీయులు స్వాతంత్య్ర‌ వేడుకలు జరుపుకుంటుండగా.. అడ్డుపడి భారతీయుల్ని కొట్టారు. భారతీయులపై పాక్‌కు చెందిన ఆందోళనకారులు కత్తితో దాడి చేసినట్టు లండన్ పోలీసులు వెల్లడించారు. లండన్‌లోని ఇండియన్ ఎంబసీ దగ్గర జరిగిన దాడికి సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే, క‌ల‌క‌లం సృష్టించిన ఈ ఘ‌న గురించి ప్ర‌త్య‌క్ష సాక్షుల అబిప్రాయం ఖ‌చ్చితంగా విలువైన‌దే. ఈ వేడుక‌ల్లో పాల్గొన్న గంప వేణుగోపాల్ గారు ఈ సంఘ‌ట‌న‌కు అక్షర రూపం ఇచ్చారు. ఈ ఘ‌ట‌న వివ‌రాలు ఆయ‌న మాటల్లోనే ``నా పేరు గంప వేణుగోపాల్ ఈ కార్యక్రమంలో కౌంటర్ ప్రొటెస్ట్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. పుల్వామా ఘటన ప్రొటెస్ట్ సందర్భంలో వేర్పాటువాదుల దాడి దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న కాశ్మీర్ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మా సాధ్యమైనంతవరకు ఎన్నారై లకు మధ్యాహ్నం 12 గంటలకు జెండా వందనం కార్యక్రమం ,సంబరాలు . పొంచి ఉన్న ప్రమాదాన్ని భారత సమాజానికి హెచ్చరించి అధిక సంఖ్యలో పాల్గొనవలసింది గా కోరాము, ప్రచారం చేసాము. అయితే, కొంద‌రు ఉద్యోగ రీత్యా ,కుటుంబ ఇతరత్రా కారణాల దృష్ట్యా కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. కార్యక్రమ రూపకల్పన ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ హై కమిషన్ , నెహ్రు గారి విగ్రహ ప్రాంతంలో జెండా వందనం, సంబరాలు చేప‌ట్టాం.`` అని తెలిపారు.

``ఉదయం 11 గంటలకు మొదట 50 మంది వరకు భారతీయులం చేరుకొని దేశ భక్తి నినాదాలు చేస్తున్నాము. అప్పటికే 500 మంది దేశ వ్యతిరేక శక్తులు ఆందోళ‌న చేయడానికి వరకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12వరకు భారతీయులు 300 మంది వరకు దేశ వ్యతిరేక శక్తులు 2000 వరకు చేరుకున్నారు! కొద్దిసేప‌టికి భారతీయులు 500 మంది వరకు దేశ వ్యతిరేక శక్తులు 4000 -5000 మంది వరకు చేరుకున్నారు. ఒంటిగంట‌కు సాధారణంగానే ఆందోళ‌న‌, ప్ర‌తి ఆందోళ‌న సాగాయి. అలా 1.30 వ‌ర‌కు సాగగా భారతీయులు ఆ అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకోకుండా తిరిగి వెళ్లిపోయారు. 1.45వ‌ర‌కు అక్క‌డి ఘ‌ట‌న దేశ వ్యతిరేక శక్తుల చేతిలోకి వెళ్లిపోయింది. అప్పటికి మేము 150 మంది ఉన్నాము. దేశ వ్యతిరేక శక్తులు చుట్టుముట్టి ఆలుగడ్డలు, కోడిగుడ్లు ,టమాటో,వాటర్ బాటిల్లు, కోక్ బాటిల్లు వంటి వాటితో దాడి చేశారు. ఇలా సాగుతున్న దేశ వ్యతిరేక శక్తుల దాడికి ఖలిస్థాన్ వేర్పాటు వాదుల శక్తులు 2 గంటలకు కలవడం తో పరిస్థితి ఉద్రిక్తతలకు చేరుకుంది`` అని వివ‌రించారు. .

మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో భారతీయ జెండాలని కాల్చివేయడం ప్రారంభించగానే పరిస్థితి ఇంకా విషమించిందని ఆయ‌న వివ‌రించారు. ``దాదాపు మరో 200 మందో పోలీసులు ,అశ్వక దళాలు దిగాయి. బాష్పావాయువుల‌ను వ‌దిలారు.హెలికాఫ్టర్ ల ద్వారా పోలీస్ ప్రాంతాన్ని వీక్షిస్తూ మరింత పోలీసు బలగాలని పంపారు. జెండా తగులబెట్టడాన్నీ గమనించిన నాతో పాటుగా,కిరణ్ పసునూరి ఇద్దరం బారికేడ్లు దాటి దేశ వ్యతిరేక శక్తుల బారికేడ్ల‌లో ప్రవేశించి చింపిన జెండాలని స్వాధీన పరుచుకున్నాం. మాకు మాజీ సైనికుడు సీకే నాయుడు గారు సహకరించారు. మాపై దాడి కి ప్రయత్నించినా వ్యక్తిపై పోలీసులు ప్రతిఘటించి బేడీలు వేశారు. ఆ సమయంలో పోలీసులు రక్షణ తో బయటపడ్డాము.`` అని ఆ సంఘ‌ట‌ను వివ‌రించారు.

దేశ వ్యతిరేక శక్తులు పథకం, వ్యూహం చాల పకడ్బందీగా అమలు చేసి కత్తులతో, తల్వార్‌లతో దాడికి ప్రయత్నించారన్నారు. ``వారు తెచ్చిన జెండాలు అన్ని కూడా ఇనుప కడ్డీలు,చువ్వలు వంటివి క‌లిగి ఉన్నాయి. 4 గంటల సమయంలో బ్రిటన్ రిజర్వు పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీన పరుచుకుని మా అందరిని ఇండియన్ హై కమిషన్‌లోకి సురక్షితంగా చేర్చారు. అనంతరం శ్రీ‌మ‌తి ఘనశ్యామ్ గారి ఆధ్వర్యం లో జెండా వందనం స్వీకరించాము.`` అని వెల్ల‌డించారు.

శత్రువుల కండ్లలో కండ్లు పెట్టి వాగ్యుద్ధం చేయడం జీవితంలో మరువని ఘటన అని గంప వేణుగోపాల్ తెలిపారు. ``బ్రిటన్ పోలిసు రక్షణ దాటి అడుగువేస్తే చనిపోయే ప్రమాద కాలం. అయినప్పటికీ మాలోని మిత్రుడు సీకే నాయుడు దాడి చేశారు. వారి బారి నుండి పోలీసులు రక్షించారు. ఈ సంద‌ర్భంగా సీకే నాయుడు గారిపై దాడి స‌మ‌యంలో పోలీసులు లేకుంటే ఏమైనా జరిగేది. డ్రగ్స్, నిషాలో ఉన్న వారి చ‌ర్య‌ల వ‌ల్ల £ 2000 ధర క‌లిగిన‌ అయన కెమెరా లెన్స్ ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంఘాల ప్రాతినిధ్యం ( Telangana NRI Forum , TAUK , Telangana జాగృతి ) హర్షణీయం. మరి తెలంగాణ ఉద్యమం నేర్పిన స్ఫూర్తి కదా ముందే ఉంటారు.`` అని తెలిపారు. తాను గ‌మ‌నించినంత మేర‌కు పాల్గొన్న తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ ప్రవాసులలో మంగళగిరి సురేష్, గంప వేణుగోపాల్ ,కిరణ్ పసునూరి, సీకే నాయుడు, నవీన్ రెడ్డి, సుమన్ బలమూరి, ప్రభాకర్ ఖాజా , మహేష్ జమ్మల, రవి కూర,రవి ఏవీజీ, నవీన్ జడల‌, సత్య, మణికంఠ, రాంచంద్రం, ప్రశాంత్, డాక్ట‌ర్ రాజు, దుర్గ ప్రసాద్, వేణు సుంకరి త‌దిత‌రులు ఉన్నారు.

ఇకపై మన బాధ్యత ఏమిటి అనే విష‌యంలో నా అభిప్రాయం ఇది అని గంప వేణుగోపాల్ తెలిపారు. ``చాలా మందికి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తే ఏం లాభం? మనం ఇక్కడ ఏమి చేయగలము ? ఎన్నో ప్రశ్నలు ? అర్థం కాకపోవొచ్చు కానీ ఈ రోజు ప్రపంచ మీడియా ఈ ఘటనపై ఏం రాసిందో మ‌న‌మంతా చదివాం. పుల్వామా దాడి ఆందోళ‌నలో మేం చావుని తప్పించుకొని బయట పడ్డాము. తాజా దాడి అతిపెద్ద ఘటన. ఇది భవిష్యత్తులో పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇకపై ఇచ్చే పిలుపుని స్వాగతించి అధిక సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలుపుదాం`` అని సూచించారు.