మోడీషాల అడ్డాలో ఉగ్రదాడికి భారీ కుట్ర..?

May 31, 2020

దేశంలో భారీ ఉగ్రదాడికి పక్కా ప్లానింగ్ జరుగుతోందా? చాప కింద నీరులా సాగుతున్న ఈ వ్యవహారాన్ని గుర్తించింది ఇంటెలిజెన్స్ బ్యూరో. ప్రధాని మోడీ.. ఆయనకు అత్యంత సన్నిహితుడు అమిత్ షాలకు అడ్డా అయిన గుజరాత్ రాష్ట్రంలోనే దాడి జరపాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. కేంద్రానికి తాజాగా సమర్పించిన రహస్య నివేదికలో బీజేపీ అగ్ర నేతలు జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరికను చేసినట్లుగా తెలుస్తోంది.

ఉగ్రదాడిలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్.. ఆ రాష్ట్ర హోంమంత్రి హరేన్ పాండ్యాలతో పాటు పలువురు మంత్రుల మీదా దాడికి ఛాన్సు ఉందంటున్నారు.
అంతేకాదు.. గుజరాత్ అతలాకుతలమయ్యేలా కొన్ని నగరాల్లోనూ ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు మంత్రులకు వార్నింగ్ లెటర్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అలెర్ట్ అయిన నిఘా విభాగం కేంద్ర హోంశాఖను.. గుజరాత్ పోలీసులను తాజా హెచ్చరికలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. అహ్మదాబాద్.. వడోదర.. సూరత్ తో పాటు రాజ్ కోట్ లోనూ ఉగ్రదాడులకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.