ఏపీలో ఇంగ్లిష్, ఆస్ట్రేలియాలో తెలుగు

August 11, 2020
తెలుగు జన్మించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష ఉండాలని అందరూ కోర్టుకు వెళ్లి కాపాడుకోవాల్సి వస్తుంటే.. ఏం జరుగుతుందో చూశాం. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం మన ఎన్నారైలు అడగగానే తెలుగు భాషను అక్కడి పాఠశాలల్లో ఐశ్చికంగా తెలుగు భాషను పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది.దీని వల్ల ఏం జరగబోతోంది అంటే... ఆస్ట్రేలియాలో చదువుకునే తెలుగు వారు తమ ఇతర పాఠ్యాంశాలతో పాటు తెలుగును ఒక ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకోవచ్చు.
ఇది విదేశాల్లో తెలుగు భాషకు లభించిన అరుదైన గౌరవం.ఇక నుంచి ఇంటర్ వరకు అన్ని పాఠశాలల్లో తెలుగు నేర్చుకునే అవకాశం ఉంది. తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలు ఈ సబ్జెక్టును ప్రవేశపెడతాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే  హిందీ, పంజాబీ, తమిళ భాషలకు ఈ అవకాశం కల్పించింది. తాజాగా ఆ జాబితాలో నాలుగో భాషగా తెలుగు చేరింది. దీంతో ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాల్లోని తెలుగు వారికి ప్రయోజనం కలగనుంది. 

​అంతేకాదు, ఇక​ నుంచి శాశ్వత నివాసం కోసం తెలుగు భాష ఆధారంగా​ కూడా  దరఖాస్తు చేసుకోవచ్చ​ట. ఆస్ట్రేలియా ప్రభుత్వ​ నిర్ణయంపై తెలుగు భాషా ప్రియులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. తెలుగు సమాఖ్య సభ్యులు, తెలుగుమల్లి, భువన విజయం వంటి​ పలు​ సాంస్కృతిక సంస్థలు​ అనేక సంవత్సరాలుగా చేసిన ప్రయత్నానికి ఫలితం ఇది.