బాలీవుడ్ కు ఘోరమైన అవమానం

April 01, 2020

ఇది కనీవినీ ఎరుగుని ప్రభంజనం. అసలు ఎన్నికల కంటే మించి ఒక సినిమా ఇలాంటి ప్రభంజనాన్ని ఇండియాలో ఎపుడూ చూపించలేదు. ఒక హాలీవుడ్ సినిమాకు జిల్లా హెడ్ క్వార్టర్లలో నాలుగు షోలు పడటం, అవి కూడా ఫుల్ అవడం ఎన్నడూ జరగలేదు. దేశంలో ఎక్కడ చూసినా ఇదే తంతు. ఆ వుడ్డు ఈ వుడ్డు అని లేదు... ఇండియన్ సినిమా ఒక హాలీవుడ్ డబ్బింగ్ సినిమా ఈడ్చి కొట్టింది. ఆ సినిమాకు దరిదాపుల్లో కూడా ప్రాంతీయ సినిమాలు, బాలీవుడ్ సినిమాలు లేకపోవడం ఒక వింత. ఇది నమ్మలేని నమ్మాల్సిన నిజం.
రెండేళ్ల కిందట ‘బాహుబలి’ ధాటికి బాలీవుడ్ బెంబేలెత్తిన విషయం తెలిసిందే. కానీ పాపం.. ఈసారి హాలీవుడ్ కూడా బాలీవుడ్ చేత ఉచ్చపోయించింది. ఇండియాలోని ప్రతి రాష్ట్రంలోనూ అవెంజర్స్ సునామీ నడుస్తోంది. దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న హిందీ సినిమాలు నెలకొల్పిన రికార్డుల్ని భారీ తేడాతో అవెంజర్స్ బద్దలు కొట్టింది. ఈ రికార్డులు ఎలా ఉన్నాయంటే... మరే హిందీ సినిమా కూడా సమీప భవిష్యత్తులో ఈ రికార్డులను అందుకోలేదు. తొలి రోజు ఇండియాలో బాహుబలి ఏకంగా ఏకంగా రూ.128 కోట్ల నెట్ వసూళ్లతో బాలీవుడ్ సినిమాలకు అందనంత ఎత్తులో నిలిచింది. జస్ట్ ఐదారేళ్ల కిందట....సినిమా లాంగ్ రన్లో వచ్చిన డబ్బులివి. కానీ బాహుబలి ఎవరూ చెరపలేని రికార్డులన నెలకొల్పింది. రెండో స్థానాన్ని రోబో 2 కొట్టేసింది. ఆ సినిమా మొదటి రోజు వసూళ్లు 58 కోట్లు. ఇపుడు అవెంజర్స్ ఒక్కరోజు నెట్ షేర్ 53 కోట్లు వచ్చింది. అంటే దేశంలో రికార్డుల విషయంలో .... మొదటి మూడు స్థానాలు బాలీవుడ్ సినిమాలకు దక్కలేదు.
దేశంలో పెద్ద సినిమా మార్కెట్ హిందీ భాషకు ఉంటే.. రికార్డులు మాత్రం బాలీవుడ్ కు దక్కకపోవడంతో బాలీవుడ్ ఘొల్లుమంటోంది. రికార్డుల విషయంలో మొదటి మూడు స్థానాలో హాలీవుడ్ సినిమా అవెంజర్స్, దక్షిణాది సినిమాలు బాహుబలి, రోబో ఉన్నాయి. ఇంతకంటే అవమానం బాలీవుడ్ కు ఏముంటుంది. బాధాకరమైన విషయం ఏంటంటే... సమీప భవిష్యత్తులో కూడా బాలీవుడ్ ఈ రికార్డులను తిరగరాసే పరిస్థితి లేదు.
ఈ శుక్రవారం విడుదలైన హాలీవుడ్ మూవీ ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ తొలి రోజు ఇండియాలో రూ.53 కోట్ల నెట్ చేయడంతో అందరి నోళ్లు మూసుకున్నాయి. విచిత్రం ఏంటంటే.. హాలిడే కాదు, వీకెండ్ కాదు. వీక్ డేస్ లో ఈ స్థాయి షేర్ రావడం ఒక ప్రభంజనం.
యుఎస్, చైనా, యూకే తర్వాత ‘ఎవెంజర్స్’కు ప్రపంచంలో అత్యధిక తొలి రోజు వసూళ్లు వచ్చిన దేశం ఇండియానే కావడం విశేషం. దీన్ని బట్టి ఇండియాలో హాలీవుడ్ సినిమాల మార్కెట్ ఏ రేంజులో ఉందో అర్థమవుతుంది. రెండో రోజుకే రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటిన ఈ సినిమా ఫుల్ రన్లో చాలా ఈజీగా రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొట్టేస్తుంది అనడంలో అనుమానం అవసరం లేదు.