అయోధ్యపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

June 03, 2020
CTYPE html>
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 134 సంవత్సరాలుగా సాగుతున్న అయోధ్య యాజమాన్య వివాదంపై ఈ రోజు (శనివారం) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ కూడిన ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం ఈ రోజు ఉదయం 10.30గంటలకు తీర్పు కాపీని చదవటం షురూ చేశారు. చీఫ్ జస్టిస్ గోగోయ్ తీర్పును చదివారు. దీని ప్రకారం అయోధ్యలోని వివాదాస్పద స్థలమైన భూమిని రామజన్మ న్యాస్ కే చెందుతుందని తేల్చింది. దీనిపై యాజమాన్య హక్కు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన షియాబోర్డును పిటిషన్ ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమం అయినట్లే.
అదే సమయంలో అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. అయోధ్య యాక్ట్ కింద మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ కేసలో మూడో కక్షిదారు అయిన నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. వారసత్వ హక్కులు క్లెయిమ్ చేసే హక్కు నిర్మోహి అఖారాకు లేదని స్పష్టం చేసింది.
తామిస్తున్న తీర్పును ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం ఏకగ్రీవంగా ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. చరిత్ర.. మతపరమైన.. న్యాయపరమైన అంశాల్ని పరిగణలోకి తీసుకొని తీర్పును ఇచ్చినట్లుగా జస్టిస్ గోగోయ్ స్పష్టం చేశారు.
ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదును నిర్మించలేదన్న విషయాన్ని తేల్చిన సుప్రీం ధర్మాసనం.. మసీదు కింద భారీ నిర్మాణం ఉందని పురావస్తు శాఖ నివేదిక వెల్లడించిందన్నారు. అంతేకాదు.. బాబ్రీ మసీదును ఎప్పడు నిర్మించారన్న దానిపై స్పష్టమైన ఆధారాలు లేవన్నారు. 12 నుంచి 16వ శతాబ్దాల మధ్య ఏం జరిగిందన్న దానికి ఆధారాలు లేవని సుప్రీం చెప్పింది.
ముస్లింలు మసీదును ఎప్పుడు వదిలివేయలేదని.. అయోధ్యను హిందువులు రామజన్మభూమిగా భావిస్తారని చెబుతూ.. వారి విశ్వాసాలను తప్పు పట్టలేమన్నారు. అయితే.. అక్కడ దేవాలయం ఉందనే ఆధారాలు లేవన్నారు. మత విశ్వాసాల్లో కోర్టు జోక్యం చేసుకోదని.. న్యాయసూత్రాల ఆధారంగానే భూమి యాజమాన్య హక్కులు నిర్ణయించాలని చెప్పింది. మసీదును కూల్చివేసిన వైనం తప్పని స్పష్టం చేసింది. భూరికార్డుల ప్రకారం వివాదాస్పద భూమి ప్రభుత్వానిదేనని తేల్చిన సుప్రీం.. పురావస్తు నివేదికల్ని మదింపు చేసుకొని తీర్పు వెల్లడించినట్లు చెప్పారు.
వివాదాస్పద భూమిని రామజన్మభూమి న్యాస్ కు అప్పగించాలని చెప్పిన సుప్రీం.. అయోధ్య యాక్ట్ కింద మూడు నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. వివాదాస్పద భూభాగాన్ని అలహాబాద్ హైకోర్టు విభజించటం అమోదయోగ్యం కాదని పేర్కొంది. కూల్చివేత చట్టవిరుద్దంగా స్పష్టం చేసింది. రాజకీయాలకు.. చరిత్రకు అతీతంగా న్యాయం నిలబడాలని సుప్రీం తన తీర్పును వెల్లడించిన సమయంలో వ్యాఖ్యానించింది.