అయ్యన్న పాత్రుడిపై దిశ చట్టం కేసు !!

August 13, 2020

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోరికలు అలా సింపుల్ గా తీరిపోతున్నానడంలో ఏ మాత్రం సందేహం లేదు. తాజాగా తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిపై నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇది నిన్నటి వార్త అనుకున్న పొరబడతారేమో... నిన్న లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కేసు అది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 188, 169, 270 ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టారు.

తాజా కేసు సంచలన కేసు. ఇది షాకింగ్. మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడి మీద ఏకంగా దిశ చట్టం కింద, నిర్భయ చట్టం కింద కేసు పెట్టారు.

కమిషనర్ కృష్ణవేణి తన పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు అయ్యన్నపాత్రుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశారు.

అసలు ఏమైందనే కదా... ప్రశ్న. అదే ట్విస్టు.

అయ్యన్న పాత్రుడి తాత ఫొటో మున్సిపల్ కార్యాలయంలో ఉంటుంది. ఆ ఫొటోను కమిషనర్ వేరే గదికి మార్చారట. అలా మార్చి అవమానిస్తారా అంటూ అయ్యన్నపాత్రుడు నిన్న ఈరోజు, మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.

ఇంకేముంది ఖేల్ ఖతం, దుకాణ్ బంద్ !