సీనియర్లే గాని... వైసీపీని చితక్కొడుతున్నారు!

August 12, 2020

వాస్తవానికి రాజకీయాల్లో సీనియర్లతో పోలిస్తే జూనియర్లు ఎక్కువ దూకుడుగా ఉంటారు. వయసై పోవడం...ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా జరిగే టైం దగ్గర పడడం....యువకుల నుంచి పోటీ ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో ....అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేందుకు సాహసించరు.అందులోనూ ఏపీలోని అధికార పక్షం వైసీపీపై టీడీపీ సీనియర్ నేతలు విమర్శలు గుప్పించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. కానీ, టీడీపీకి చెందిన ఈ ఇధ్దరు సీనియర్ నేతలు మాత్రం జూనియర్లకు సాధ్యం కాని రీతిలో వైసీపీ, జగన్ పై సెటైర్లు వేస్తున్నారు.

ఈ తరంతో పోటీ పడుతూ ట్విట్టర్లో తమ రాజకీయ చతురతను జోడించి మరీ సెటైర్ల కూత పెడుతున్నారు. జీబీసీ పేరుతో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలాకాలం నుంచి ఈ సెటైర్ల పరంపర మొదలుపెట్టారు. తాజాగా, మరో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు....గోరంట్లను ఫాలో అవుతూ...`అయ్యన్న ఆన`అంటూ వైసీపీ, జగన్ పై ట్విట్టర్లో సెటైర్లు పేలుస్తున్నారు.

`అయ్యన్న ఆన` పేరుతో ట్విట్టర్లో జగన్, వైసీపీలపై గోరంట్ల బాటలోనే అయ్యన్న పాత్రుడు సెటైర్లు కురిపిస్తున్నారు. ఒక రోజుకు జగన్ వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్ల ఖర్చు 43.44 లక్షలైతే...జగన్ మూడు పూటల భోజనం ఖర్చుకు బిల్లుపెడితే....రోజుకో నగరం అమ్మేయాల్సిందేనంటూ సెటైర్ వేశారు అయ్యన్నపాత్రుడు. 

విజయసాయి గారి జన్మదినోత్సవం గిఫ్టు భలే ఉందంటూ మరో సెటైర్ వేశారు అయ్యన్న. ఇళ్ల స్థలాల గురించి సెటైర్ వేస్తూ ప్రజల సొమ్మును అల్లుడికి విజయసాయి కట్నంగా ఇచ్చాడంటూ పంచ్ వేశారు. విజయవంతంగా మూడో సారి ఇళ్ల స్థలాల అమ్మకం వాయిదా వేశారంటూ మరో సెటైర్ వేశారు అయ్యన్న. ఈ మీమ్స్ ను `అయ్యన్న ఆన`పేరుతో పోస్ట్ చేశారు అయ్యన్న. ఇది లోగోలో తయారుచేశారు అన్ని మీమ్స్ కి.

ఇక, చాలాకాలంగా `#9amPrimeTime #GBC` అంటూ గోరంట్ల ట్విట్టర్లో పంచ్ లు పేలుస్తున్నారు. వైసీపీ, జగన్ లపై వెటకారంతో కూడిన పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. కలలో 'రూలర్...' ఇలలో మాత్రం 'రోడ్డు రోలర్..'అంటూ జగన్ పాలనపై అంబటి కల కల్లలైనట్లు సెటైర్ వేశారు గోరంట్ల. స్పీకర్ అయితే అన్ని ముడుచుకుని కూర్చుని చూస్తూ ఉండాలా అన్న తమ్మినేని కామెంట్ కు జీబీసీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

ప్రభుత్వం ఏం చేస్తున్నా కోర్టులు చూస్తూ ఉండాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారంటూ...తమ్మినేనిపై సెటైర్ వేశారు. టిడిపి హయం లో 'ట్రాన్సపెరన్సీ' పద్ధతి లో గవర్నమెంట్ వెళ్తే.. వైసీపీ హయాంలో 'కాన్స్ పిరేసీ' పద్దతిలో గవర్నమెంట్ వెళ్తుందంటూ గోరంట్ల మరో సెటైర్ వేశారు. మరి, ఈ ఇద్దరు సీనియర్ నేతలను ఆదర్శంగా తీసుకొని...జూనియర్ నేతలు కూడా సెటైర్లు వేయడం మొదలుపెడతారేమో వేచి చూడాలి.