అరెస్టును తప్పించుకున్న అయ్యన్నపాత్రుడు... హైకోర్టు ఏమన్నదంటే...

August 12, 2020

టీడీపీ నేతలను అరెస్టు చేయడంలో పోలీసుల్లో మంచి ఉత్సాహం కనిపిస్తోంది. సాధారణంగా స్టేషనుకు రమ్మని పిలిచినా వచ్చి అరెస్టయ్యే నేతలను భారీ ఎత్తున పారిపోయే వారిని పట్టుకున్నట్టు సీన్ క్రియేట్ చేసి అరెస్టు చేస్తున్నారు.

అధికారం ఎంత వాడితే అంత పదునుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తీవ్రమైన వ్యాఖ్యలుచేసినా, బూతులు తిట్టిన అది ప్రజాస్వామ్య హక్కుగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. నేతల వరుస బెట్టి జరుగుతున్నాయి.

సీఐడీ విచారణ లో భాగంగా పలువురు నేతలను అరెస్టు చేస్తున్నారు. ఈ విషయాలను అరెస్టుల కంటే ముందే వైకాపా నేతలే హెచ్చరిస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఇదిలా ఉండగా.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిపై అభ్యంతరకరమైన భాష వాడారని ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన అరెస్టు ఖాయమని వార్తలు వచ్చాయి. అంతలోపు ఆయన కోర్టును ఆశ్రయించారు.

అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం అయ్యన్నను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అంటే మరో రెండు వారాల పాటు అరెస్టు చేసే అవకాశం లేదు. అంతలోపు ప్రభుత్వం చట్టం ప్రకారం ఆయనను అరెస్టు చేయడానికి అవసరమైన ఆధారాలు కోర్టుకు సమర్పిస్తే అపుడు కోర్టు తదుపరి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.