విజయసాయి రెడ్డికి పిచ్చెక్కింది-అయ్యన్నపాత్రుడు

May 25, 2020

16 నెలలు జైల్లో ఉండి చిప్పకూడు తిని ఏపీ ప్రజల ఖర్మ కొద్దీ రాజ్యసభ నెంబర్ గా ఎన్నికయ్యావు. ఉన్నతమైన స్థానంలో ఉన్నావు. మా విశాఖ ప్రజల ఖర్మ కొద్దీ విశాఖ నగరానికి ఇన్ చార్జ్ గా వచ్చారు. కరోనా సమయంలో ప్రజలకు ఏం సాయం చేస్తావు? రైతులు పడుతున్న కష్టాలకు ఏం ఉపశమనం కలిగిస్తావు? కరోనాను అరికట్టేందుకు ఏం చేప్తావోనని ప్రజలంతా ఎదురుచూస్తే నువ్వు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలేంటి?
ప్రభుత్వ విధానాలు, చేస్తున్న కార్యక్రమాలు చెప్పకుండా చంద్రబాబును తిట్టడం కోసమే ప్రెస్ మీట్ పెట్టావా? ఒక్క చంద్రబాబునే కాకుండా ఆయన కుటుంబసభ్యులందరినీ తిట్టే కార్యక్రమం పెట్టుకున్నావా? నీ కుటుంబసభ్యులు, జగన్ కుటుంబసభ్యుల గురించి మేమెప్పుడైనా మాట్లాడామా?
చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడ్డానికి నీకు సభ్యత లేదా సంస్కారం లేదా? జైలు బుద్ధులు పోవా నీకు? చంద్రబాబుకు పిచ్చి పట్టిందంటావా? నీ మాటలు చూస్తుంటే నీకే పిచ్చి పట్టిందని జనానికి అర్దమైంది. చంద్రబాబు అధికారంలో లేకపోయినా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హుద్ హుద్ సమయంలో విశాఖను ఎలా సాధారణ స్థితికి తెచ్చారో చూశావుగా..వేల కోట్లు దోచుకున్న మాకు ఒకరు సలహాలు ఇవ్వడమేంటని అనుకుంటున్నావు.

విదేశాల్లో ఉన్న తెలుగువారితో చంద్రబాబు మాట్లాడితే ఎగతాళి చేస్తావా ? ఆ పని మీ ముఖ్యమంత్రి చేయకపోగా చంద్రబాబు చేస్తుంటే నీకు కళ్లు మంటా?
కరోనాతో రాష్ట్రం అల్లాడిపోతుంటే నీ ముఖ్యమంత్రి రోజూ సాయంత్రం గేమ్స్ ఆడుకుంటున్నాడు. అటువంటి పనికిరాని ముఖ్యమంత్రికి నువ్వో పనికిరాని సలహాదారుడివి. నీ ప్రెస్ మీట్ చూస్తే చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించడమే కానీ కరోనా సాయం గురించి ఎక్కడైనా మాట్లాడావా?
ప్రెస్ మీట్ మధ్యలో మళ్లీ లక్ష్మీ పార్వతి , రామ్ గోపాల్ ఎందుకొచ్చారు? వారికీ కరోనాకు ఏమిటి సంబంధం? పిచ్చిపట్టి మాట్లాడుతున్నారా మీరంతా ?
కరోనాను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని నువ్వు మాట్లాడుతున్నారు...రాజకీయం చేస్తోంది మీరు. కరోనా పెరుగుతున్నా ఎన్నికలు పెట్టాలని చూసింది మీరు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేస్తే అతను మీ మాట వినలేదని పోస్టు నుంచి తీసేసి రాజకీయం చేసింది మీరు కాదా?
కరోనా ఉన్నా ఎన్నికలు జరపాలని మీకు ఆత్రుత ఏంటి? కరోనా తగ్గాక బతికి బావుంటే అప్పుడు పెట్టొచ్చు కదా. కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఇంటింటికి తీసుకెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పింది మీరు కాదా? అన్ని వెధవ పనులు మీరు చేసి చంద్రబాబు గురించి మాట్లాడ్డానికి సిగ్గూ లజ్జా లేదా? మీకు చదువు సంస్కారం ఏమైంది?
83 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. విశాఖలో అన్ని పార్టీల్లో మంచి లీడర్లు ఉండేవారు. జిల్లా కోసం అందరూ పోరాడేవాళ్లం. మా ఖర్మ కొద్దీ నువ్వు విశాఖ జిల్లాకొచ్చావ్. రాజకీయాలు, గ్రూపులు మొదలయ్యాయి. ఇవాళ విశాఖ జిల్లాలో కరోనా తప్పుడు లెక్కలు చూపిస్తున్నావు. వారం క్రితం విశాఖలో 20 కేసులు ఉన్నాయని చెప్పారు. అందులో 16మంది బాగానే ఉన్నారు. ఆరుగురు ఆస్పత్రిలో ఉన్నారని చెప్పారు. పదహారూ, ఆరు ఎంత?
విశాఖలో కేసులు ఉధృతమయితే ప్రజలేమవుతారు ఇది పద్దతా ? లాక్ డౌన్ ప్రకటించి 28 రోజులైనా టెస్టింగ్ మిషన్ కూడా తెచ్చుకోలేకపోయారా? ఇదేనా మీ ప్రభుత్వం?మాట్లాడే పద్దతి నేర్చుకోండి. ప్రజలకు వాస్తవాలు చెప్పండి. పాలన మీకు తెలియకపోతే అనుభవం ఉన్న నేతలను, ఐఏఎస్ ఆఫీసర్లను అడిగి తెలుసుకోండి. సైంటిస్టులు, డాక్టర్లను కలిసి మాట్లాడండి. విశాఖలో ఏం జరుగుతోందో డాక్టర్లే మాకు చెబుతున్నారు. నిజాలు చెబితే మా ఉద్యోగాలు పోతాయని డాక్టర్లే స్వయంగా చెప్పారు.
మీకు కొన్ని సూచనలు చేయాలని మేం ప్రయత్నిస్తుంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. దౌర్జన్యం చేస్తోంది మీరా మేమా...ఇదా రాజకీయం. ఉత్తరాంధ్రను నేనే చూసుకుంటానని విజయసాయి పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం కూలీలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని వేలాది కిలోమీటర్లు నడుస్తుంటే కళ్లు పూడుకుపోయాయా మీకు. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది విజయసాయీ?

వెధవ పనులు చేస్తూ పతివ్రతా శిరోమణిలా మాట్లాడ్డానికి సిగ్గుండక్కర్లా నీకు?
రైతుల ధాన్యం కల్లాల్లో ఉన్నాయి. ఇంకేముంది ధాన్యం కొంటామని కబుర్లు చెప్పారు ఏమైంది? ఈరోజుకి విశాఖ జిల్లాల్లో ఎక్కడ కొన్నారు ధాన్యం చెప్పండి. రైతులు కూరగాయలను రోడ్లపై పోసుకుంటున్నారు. వారి నుంచి కూరగాయలు కొనలేరా మీరు? నువ్వు పెద్దమనిషవా?
దేశంలోనే హాట్ స్పాట్ లున్న ప్రాంతాల్లో మన రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. ఆ విషయం మీకు తెలుసా ? విజయసాయి రెడ్డి నీకు సిగ్గుందా? అది తెలిశాకైనా బుద్ది రాలేదటయ్యా 5వ స్థానం అంటే మీ పాలన ఎలా ఉందో అర్ధమవుతోంది? కరోనా నియంత్రణకు మీ ముఖ్యమంత్రి, మీరు చేస్తున్న ప్రయత్నమేంటో దీన్ని బట్టి అర్దమవుతోంది. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోండి..లేనిపోని ప్రస్టేజ్ లకు వెళ్లొద్దు. పెద్దల సలహాలు తీసుకోండి. ఏపీ ప్రజలను కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా పనిచేసేందుకు మేము సిద్దం. మీరు కూడా బుద్ది తెచ్చుకుని ప్రజలను కాపాడండి.

 

RELATED ARTICLES

  • No related artciles found