స్ఫూర్తిదాయకంగా అయ్యన్నపాత్రుడి ప్రసంగం

April 04, 2020

చట్టాలంటే విశ్వాసం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, రాజ్యాంగంపై నమ్మకం లేదు..పనికిమాలిన వాడు పాలకుడైతే ఇలాగే ఉంటుంది. జనం అల్లాడిపోతున్నారు, వైసిపికి భయపడి కాదు..వీళ్ల వేధింపులకు తట్టుకోలేక పోతున్నారు.
1983 రాజకీయాలు వేరు..ఇప్పుడు రాజకీయాలు వేరు..అప్పుడు సిద్దాంతాలు/ విధానాలు వేరు..ఇప్పుడు సిద్దాంతాలు/ విధానాలు వేరు.. భూములు దోచేవాడు, ఖూనీలు చేసేవాడే రాజకీయాలు చేసే రోజులొచ్చాయి.
ఎన్టీఆర్ సీటిచ్చినప్పుడు మొదటి ఎన్నికల్లో రూ 35వేలు ఖర్చు అయ్యింది.ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు రూ 4వేలు ఇచ్చారట, మా బంధువులే చెప్పారు.
పంచాయితీ ఎన్నికలొస్తే పోటీకి రాకూడదనే భయం రేకెత్తిస్తున్నారు. కానీ ఈ రోజుకూ ఎవరూ లొంగడానికి సిద్దంగా లేరు.
ఈ కష్టకాలంలో కూడా లక్షలాది కార్యకర్తలు పార్టీకి దృఢంగా నిలబడిన విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను

నరేగా బిల్లులు జాప్యం చేయగలరేతప్ప వాటిని ఆపలేరు. జగన్ కాదు కదా, ఆయన బాబు దిగివచ్చినా ఆపలేరు.
టిడిపిని నిలబెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు ఒక్కడిదే కాదు. షో వర్క్ చేయవలసిన సమయం కాదు. కష్టకాలంలో షో వర్క్ చేయకుండా అందరూ పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కావాలి. అకస్మాత్తుగా ఫోన్ చేసి ఆందోళన చేయమంటే ఏవో కొద్దిమందితో చేస్తే ఇంపాక్ట్ రాదు. రెండు మూడు రోజుల ముందు చెబితే, వేలాదిమందితో చేస్తే ఆ ఇంపాక్ట్ తీవ్రంగా ఉంటుంది.
‘‘పార్టీకి మనం ఎంత అవసరమో, మనకు పార్టీ అంతకన్నా అవసరం’’ అనేది అందరూ గుర్తుంచుకోవాలి.
ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు..మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు.

మొన్న ఒకామె పించన్ తొలగించారని గింజుకుంటుంటే చెప్పాను, ‘‘ గట్టిగా కొట్టుకోబాకు, ఇంకా 4సంవత్సరాలు కొట్టుకోవాలని’’ చెప్పాను.
ఇప్పటికీ నిద్ర పట్టడం లేదు రాత్రుళ్లు..23సీట్లు ఇచ్చేంత తప్పు చేశామా..? ఓడిపోతే, ఓడిపోతాం రాజకీయంగా..అపోజిషన్ లో ఉన్నప్పటికన్నా ఎక్కువ కష్టపడ్డాం.

అమ్మవడికి డబ్బుల్లేక, ఈ రోజు విశాఖలో 2వేల ఎకరాలు అమ్మేసి చేస్తాడంట..
‘‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’’ ఇందులో తప్పేంటి..?బుర్ర ఉన్నోడు ఎవడైనా 3రాజధానులు అంటారా..?
నీ దయవల్ల ఉద్యోగాలు వచ్చే కంపెనీలన్నీ పోయాయి. విశాఖలో ఏం చేస్తావు 3బిల్డింగులతో..?
నువ్వు చేశావా, నీ బాబు చేశాడా విశాఖకు ఏమైనా..? ఏదైనా చేస్తే చంద్రబాబు చేశాడు విశాఖకు..
బొమ్మను మార్చినట్లు మారుస్తావా రాజధానిని..? ఎన్నికల్లో ఎక్కడైనా చెప్పావా రాజధానిని మారుస్తానని..? లేదూ మేనిఫెస్టోలో రాశావా..? ఇదేమైనా చిన్నవిషయమా, చాలా సీరియస్ విషయం..
పెద్దలందరినీ కూర్చోపెట్టి నా ఆలోచన ఇదని చెప్పావా..? ఎవరితోనైనా చర్చించావా..? ప్రజాభిప్రాయం తీసుకున్నావా..?
నీకు సిగ్గు లేకపోతే, అది చేసే వాళ్లకైనా సిగ్గుండాలి కదా..?
రాజధానికి కేంద్రం రూ 2,500కోట్లు ఇచ్చింది, మరి దానిని మారుస్తానని వాళ్ల పర్మిషన్ తీసుకున్నావా..? శంకుస్థాపన చేసిన ప్రధానికి అయినా చెప్పావా..? రాష్ట్రాలలో ఇలాంటి తిక్క పనులు చేస్తుంటే కేంద్రం చూస్తూ ఊరుకోరాదు.
ప్రత్యేక హోదా నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే అతని దురుద్దేశం..25మంది ఎంపిలనిస్తే కేంద్రం మెడలు వంచుతానని చెప్పి, ఈ 8నెలల్లో ప్రత్యేక హోదా గురించి ఎక్కడన్నా మాట్లాడారా..? హోదా గురించి జగన్ మాట్లాడి ఎన్ని నెలలైంది..? మా రామ్మోహన్ నాయుడు, మా జయదేవ్ మాట్లాడుతుంటే, మీ వాళ్లను ఆ ఇద్దరి మీదకు ఉసిగొల్పుతావా..?

ప్రతి పనికిమాలిన నా...బూతులకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ దౌర్భాగ్యులు ప్రజావ్యతిరేక నిర్ణయాలపై మనం మాట్లాడాలి బహిరంగంగా..
మాట్లాడే దమ్ము లేకపోతే, మీకు-జగన్ కు బంధుత్వాలు ఉంటే, వెళ్లి ఇంట్లో కూర్చోండయ్యా..
గ్రామీణాభివృద్ది మంత్రిగా నేను ఢిల్లీ వెళ్లినప్పుడు మన అధికారులు ప్రజెంటేషన్ ఇస్తే, వెళ్లి చంద్రబాబు దగ్గర నేర్చుకోమని ఇదే ప్రధానమంత్రి అక్కడున్న అధికారులతో అప్పట్లో చెప్పారు. నేనే అందుకు సాక్ష్యం..
భారతదేశం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు. వీళ్లు తిట్టినంతమాత్రాన ఆయన గొప్పదనం తగ్గేది కాదు.

ఒక నియోజకవర్గం చూసే మనకే ఇన్ని సమస్యలుంటే, 175నియోజకవర్గాలు చూసే ఆయన(చంద్రబాబు)కెన్ని సమస్యలు..? మనం అర్ధం చేసుకోవాలి.
పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. పదిమందిని కూడగట్టాలి. పేదలకు అండగా ఉండాలి. కష్టాల్లో అండగా ఉన్నప్పుడే మనల్ని గుర్తుంచుకుంటారు.
ఇది అందరికీ కష్టకాలం. 19లక్షల కార్డులు తొలగించారు, 6లక్షల పించన్లు తొలగించారు. టిడిపి స్కీములన్నీ రద్దు చేశారు. పేదవాడి నోటికాడ ముద్ద తీసేశారు.
ఇప్పుడే నాయకుడనే వాడి అండ అవసరం వాళ్లకు. కాబట్టి అందరూ కమ్ముకోవాలి.రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.

 

Read Also

సంక్రాంతికి అందని జీతం
"విప్లవ ఠాకూర్" కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపి ప్రసంగం 
బడ్జెట్‌ ఘనం.. ఖర్చు స్వల్పం