మోడీలో నచ్చనిదే ఆ లక్షణం.. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

December 11, 2019

ప్రత్యేక హోదా పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరతరాలు మరచిపోలేని మోసం చేశారు మోడీ. హోదా విషయమై చంద్రబాబు ఎంత చాకచక్యంగా వ్యవహరించినప్పటికీ.. మొండి చేయి చూపింది ఏపీ ప్రజల ఆగ్రహ జ్వాలలకు గురయ్యారు నరేంద్ర మోడీ. ఈ నేపథ్యంలో అవకాశం వచ్చిన ప్రతీసారి మోడీ తీరును కడిగిపారేస్తున్నారు చంద్రబాబు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఈసీపై గుర్రుగా ఉన్న బాబు ఢిల్లీలో ఈసీ సంగతి తేల్చుకోవాలని ఉద్యమం చేస్తున్నారు. ఈ సందర్బంగా మరోసారి మోడీపై విరుచుకు పడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.

మంగళవారం రోజు చెన్నైకు వచ్చిన ఆయన డీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. అనంతరం డీఎంకే ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమిళనాడులాంటి రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్‌ సాధించింది ఎంత? ఏమైనా అంటే మోదీ గుజరాత్‌ మోడల్‌ అంటారని, అసలు గుజరాత్‌ మోడల్‌ ఎక్కడుందని ప్రశ్నించారు. ఐదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసింది శూన్యమని చెప్పారు. మోదీ వైఫల్యాలను రఘురాంరాజన్‌ వంటి వాళ్లు… అర్థమయ్యేలా చెప్పి… పరిష్కారం చూపారని, అందుకే అలాంటివారంటే మోదీకి గిట్టదని చంద్రబాబు అన్నారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు భవిష్యత్‌లో కలిసి పనిచేస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక కూటమే అధికారంలోకి వస్తుందని, స్టాలిన్‌ క్రియాశీలక పాత్ర పోషిస్తారని అన్నారు. డీఎంకేకు ఓటేసి గెలింపించాలని చంద్రబాబు నాయుడు తమిళనాడులోని తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఐటీ దాడులు టీడీపీ, డీఎంకే, తృణమూల్‌పైనే ఎందుకు జరుగుతున్నాయి? అన్నాడీఎంకే, బీజేపీ నాయకులపై ఎందుకు జరగలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మంగళవారం చెన్నైకు వచ్చిన ఆయన డీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. అనంతరం డీఎంకే ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ద్రవిడ సంస్కృతి చాలా విశిష్టమైనది.. వారితో పెట్టుకున్నవారెవరూ గెలిచిన దాఖలాలు లేవని అన్నారు. తమిళుల ఆత్మగౌరవంతో మోదీ ఆడుకోవాలనుకున్నారని, జట్టికట్టు లాంటి విషయాల్లో తమిళులు పోరాటం అభినందనీయమని కొనియాడారు. తమిళ రైతులు ఢిల్లీలో అర్ధనగ్న నిరసనలు తెలిపిన ప్రధాని మోదీ పట్టించుకోలేదని చంద్రబాబు విమర్శించారు. రైతులే బీజేపీని పాతర పెట్టేందుకు సిద్ధమయ్యారని బాబు పేర్కొన్నారు. అన్నాడీఎంకే .. మోదీ చేతిలో కీలు బొమ్మ అయిపోయిందన్నారు. మోదీ చెప్పినట్టల్లా ఆడుతోందని విమర్శించారు. స్టాలిన్‌ తిరుగులేని నాయకుడిగా నిలిచారని, తమిళనాడు ప్రజలు స్టాలిన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. దీంతో బాబు మాట్లాడిన ఈ మాటలు దేశ రాజకీయ వర్గాల్లో పలు చర్చలకు దారి తీస్తున్నాయి.