ఈ ఐడియా చంద్రబాబుకు కూడా రాలేదే !

July 04, 2020

చంద్రబాబును తిట్టడం విజయసాయిరెడ్డి ప్రధాన కార్యక్రమాల్లో ఒకటి. అబద్ధాలు నిజాలతో సంబంధం లేదు. న్యాయాన్యాయలనూ చూసుకోడు. అయితే, బాబును తిట్టే క్రమంలో కొన్ని తప్పులు చేస్తు అపుడపుడు దొరికిపోతుంటాడు. మొన్నామధ్యన పోలీసు పదోన్నతుల విషయంలో అందరూ కమ్మోళ్లకే ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపణ చేశాడు. కానీ విజయసాయిరెడ్డి చెప్పిన దాంట్లో 10 శాతం కూడా నిజం లేదు. సోషల్ మీడియాలో సాయిరెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు జనం. దీంతో దానిని పక్కకు పెట్టేశాడు. అయితే, తాజాగా చంద్రబాబును విమర్శించే విజయసాయిరెడ్డి తన గురించి తాను మరిచిపోయి ఓ మాట అనేశి అడ్డంగా బుక్కయ్యాడు. దీనిని ఎవరూ పట్టుకోలేకపోయారు గాని... బుద్ధా వెంకన్న పట్టేశారు. విజయసాయిరెడ్డిని ఉతికిఆరేశారు.

మాపై కుట్ర చేయడానికి మీ నాన్న చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నాడు అని ఆనాడు వైసీపీ సృష్టించిన అబద్దాన్నే మళ్లీ చెప్పాడు సాయిరెడ్డి. అయితే, అక్కడితో ఆగకుండా ఇప్పడు అదే చిదంబరం, ఆయన కొడుకు బెయిలుపై ఉన్నారని వ్యాఖ్యానించారు.
వాస్తవానికి విజయసాయిరెడ్డి, జగన్ కూడా బెయిలు మీదే బయట ఉన్నారు. వారు ఇప్పటికీ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నది అందుకే. అయితే, తను బెయిలు మీదున్న విషయాన్ని మరిచిపోయిన సాయరెడ్డి... ఇంకెవరి బెయిలు గురించో మాట్లాడాడు. ఈ విషయంపై సాయిరెడ్డికి భారీ కౌంటర్ వేశారు బుద్ధా వెంకన్న. వరుస ట్వీట్లతో విజయసాయి గాలి తీసేశారు.

tweet1
‘‘తలపండిన మేతా‘‘వి సాయిరెడ్డి గారూ చిదంబరం గారు, ఆయన కొడుకు బెయిల్ పై ఉన్నారా? మరి మీ జంట చంచలగూడ జైలు నుంచి వీసాపై ఏమైనా బయటకొచ్చారా?
tweet2
దొంగల లెక్కల దొరా! తమరు చీకట్లో చిదంబరం గారి ఇంట్లో ఏం చేస్తున్నారు? మోడీ గారి మెడలు వంచుతానని వెళ్లి కనపడగానే కాళ్లప మోకరిల్లారు. మోడీ గారు అడ్డుకోకుండా ఉంటే జగన్ గారు కాళ్లకు అడ్డం పడేవారు. మీరు అన్నది నిజమే మీ అక్రమాస్తుల ముఠాకి మోడీ గారి చేతిలో మూడే రోజు దగ్గర్లోనే ఉంది విజయ్ గారూ!
tweet 3
క్విడ్ ప్రోకో ఎంపీ విజయమాయరెడ్డి గారూ!
మంగళగిరిలో లోకేష్ ఓడినా 1,03,127 ఓట్లు సాధించి ప్రజా హృదయ విజేత అయ్యాడు. మరి మీరో? లక్షల కోట్ల దోపిడీ చకేసినందుకు క్విడ్ ప్రో కో కింద ఎంపీ అయ్యారు.

ఈ ట్వీట్లు చూస్తే... సాయిరెడ్డి తెగించినట్లు మిగతా వాళ్లు తెగిస్తే అసలు జగన్ బ్యాచ్ కు నిద్ర కూడా పట్టదని అర్థమవుతుంది.