విపత్తుల వేళా..

August 07, 2020

వికృత రాజకీయం

రాజధాని గ్రామాలకు కరోనా అంటించేందుకు కుట్ర
అమరావతి పేరిట విద్వేష పోస్టులు
విశాఖకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు

రాజధాని తరలింపును శాయశక్తులలా అడ్డుకుంటున్న అమరావతి ప్రాంత ప్రజలపై జగన్‌ ప్రభుత్వంతో పాటు ఆయన పార్టీ వైసీపీ కూడా కుట్ర పన్నింది. అనుచిత కేసులు, పోలీసుల దౌర్జన్యాలు, రైతుల భూములను బయటి ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని నిర్ణయించడం వంటివి ప్రభుత్వపరంగా జరుగుతుంటే.. సోషల్‌ మీడియాలో అమరావతికి వ్యతిరేకంగా పోస్టింగులు పెడుతూ వైసీపీ వికృత రాజకీయాలకు పాల్పడుతోంది.
 
అంతేకాదు.. మద్యం షాపులు తెరిచి.. రెడ్‌జోన్లలో ఉన్నవారిని రాజధాని గ్రామాలకు పంపించి.. ఇళ్లలోనే శాంతియుతంగా అమరావతి పరిరక్షణ ఉద్యమం చేస్తున్న రైతులు, మహిళలు, ప్రజలకు కరోనా సోకేలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఓపక్క లాక్‌డౌన్‌ అమలవుతుంటే.. జనమెవరూ బయటకు రాని పరిస్థితుల్లో.. పోలీసులు ఆయా గ్రామాలకు వెళ్లి.. మహిళలకు నోటీసులిస్తున్నారు. మీపై కేసులున్నాయి.. పోలీసు స్టేషన్లకు రావాలని హుకుం జారీచేస్తున్నారు.
 
అది కూడా చిలకలూరిపేట, తెనాలి, నందిగామ పోలీసు స్టేషన్లకు రావాలని అంటున్నారు. ఓపక్క జనం బయటకు వస్తే లాఠీలతో చితక్కొడుతున్నారు. రవాణా సౌకర్యాలన్నీ నిలిచిపోయాయి. కానీ మద్యం షాపులు తెరచి.. ఆయా గ్రామాలకు రెడ్‌జోన్లలో ఉన్నవారు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. దీనివెనుక అసలు కుట్ర వేరే ఉంది.
 
ఎలాగైనా రాజధాని గ్రామాల్లో కరోనా వైరస్‌ అంటించాలని.. ఇప్పటికే గుంటూరు. కృష్ణా జిల్లాల్లో మహమ్మారి విజృంభిస్తున్నందున ఈ ప్రాంతం రాజధానికి పనికిరాదని, విశాఖ వెళ్లడమే కరెక్టని చెప్పుకొనేందుకు ఇలాంటి దుర్మార్గ రాజకీయాలకు వైసీపీ తెరతీస్తోంది. ఇంతవరకే పరిమితం కాలేదు. విశాఖలో ప్రమాదకరమైన విషవాయువు స్టైరిన్‌ లీకై 12 మంది చనిపోయి.. వేల మంది ప్రభావితులైన సంఘటనను కూడా విద్వేషపూరిత రాజకీయానికి వాడుకుంటోంది. గ్యాస్‌ లీకేజీ అనంతర దృశ్యాలను టీవీ చానళ్లలో చూస్తే ఎలాంటివారికైనా హృదయం ద్రవిస్తుంది.
 
 
ఇతర రాష్ట్రాల వారు, ఇతర దేశాల్లోని వారు కూడా బోఽపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనను గుర్తుచేసుకుని.. అయ్యో పాపం.. విశాఖపట్నంలో ఎంత ఘోరం జరిగిందని బాధపడుతున్నారు. కానీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ సోల్‌ మీడియా ఇక్కడే కొంతమంది వికృత  రాజకీయానికి తెరతీశారు. ‘మై కేపిటల్‌ అమరావతి-నర్రా శ్రీనివాస చౌదరి’ అన్న పేరుతో ఉన్న ట్విటర్‌ ఖాతాకు డీపీగా చంద్రబాబు బొమ్మ ఉంచారు.
 
అందులో ఒక పోస్టు పెట్టారు. ‘దేవుడు ఉన్నాడురా.. మా అమరావతి ప్రజల ఏడుపు తగిలే వైజాగ్‌ వాళ్లకు ఇలా జరుగుతోంది.. ఇంకా జరగాలి. ఇంకా ఇంకా జరగాలి. రాజధానిగా అమరావతినే ఉంచేవరకూ ఇలాంటివి జరుగుతూనే ఉండాలి..’అని అందులో పేర్కొన్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారంతా ఉలిక్కిపడ్డారు. ఇది ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కాదా?
 
అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఉంటున్నా.. ఎప్పుడూ విశాఖవాసులపై రాజధాని ప్రాంతవాసులు దుమ్మెత్తిపోయలేదు. సోదరులుగానే భావిస్తున్నారు. ఇంతవిషాదకర పరిస్థితుల్లో ఇలాంటి పోస్టింగ్‌ ఎవరు పెట్టారా అని నెటిజన్లు ఆరా తీశారు. ఆ పోస్టింగ్‌ ఎవరూ పెట్టలేదని.. అసలు ఆ పేరుతో ట్విటర్‌ ఖాతాయే లేదని తేలింది. అంటే ఫేక్‌ న్యూస్‌కు తెరలేనారన్నమాట.
 
కావాలనే తెలుగుదేశం పార్టీ, అమరావతి రైతులపై దురభిప్రాయం కలిగించేందుకే ఇదంతా చేశారని తేలిపోయింది. అసలు ఏ ట్విటర్‌ ఖాతా అయినా.. దాని పేరు 15 ఆంగ్ల అక్షరాలకు మించి ఉండకూడదు. కానీ ఈ ఫేక్‌ ఖాతాకు అంతకంటే చాలా ఎక్కువ అక్షరాలున్నాయి. దీంతో ఇది వైసీపీ వాళ్ల రాజకీయమని అర్థమైంది. ఇలాంటి సమయంలోను ఇంత వికృతంగా రాజకీయం చే స్తారా అని సోషల్‌ మీడియాలోనే పలువురు నిలదీశారు.
 
ఎవరో ఏదో అంటారన్న భయంతో ముందే భుజాలు తడుముకుని ఇలాంటి వికృత ఆలోచనలు చేస్తున్నారా అని ధ్వజమెత్తారు.