వైసీపీలో చేరిన బాలయ్య నమ్మినబంటు

May 25, 2020

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఒక్కొక్కరిగా టీడీపీ నేతలను పార్టీలోకి లాక్కునే వ్యూహంతో వైసీపీ ముందుకు వెళ్తోంది. తద్వారా తాము బలహీనపడలేదనే సంకేతాలను ప్రజల్లోకి పంపడానికి వైసీపీ ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ రక్తం మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రహమాన్ వైసీపీలో చేరి 24 గంటలు గడవక ముందే టీడీపీకి మరో షాక్ తగిలింది. హిందూపురం ఎమ్మెల్యే బాలక‌ృష్ణకు అత్యంత సన్నిహితుడు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే బాబురావు వైసీపీలో చేరడంతో టీడీపీలో చేరారు. బాబురావుకు ముఖ్యమంత్రి జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.  బాబురావు పార్టీని వీడనున్నారని కొద్ది రోజులుగా వస్తోన్న ఊహాగానాలను నిజం చేస్తూ...బాబూ రావు వైసీపీలో చేరడంతో టీడీపీ అధిష్టానం ఖంగుతింది. అయితే... వాపును బలుపుగా చూపుకునేందుకు ఎన్నికల ముందు వైసీపీ చేస్తున్న ప్రయత్నం అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

 

పార్టీ చేరికలు అధికార పక్షాలకు ఉపయోగపడిన ఉదాహరణలు చరిత్రలో లేవని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా బాబూరావు 12 వేల మెజారిటీతో విజయం సాధించారు. 2009లో కనిగిరి టికెట్ దక్కించకున్న బాబూరావు..టెక్నికల్ రీజన్స్ వల్ల నామినేషన్ తిరస్కరణకు గురవడంతో పోటీ చేయలేకపోయారు.

వైసీపీలో చేరిన అనంతరం అందరూ పాటించే సంప్రదాయాన్ని బాబూరావు కూడా పాటించారు. చంద్రబాబుపై బాబురావు విమర్శలు, నిందలు, తీవ్రారోపణలు చేశారు. వైసీపీ ఊతపదమైన ’’నమ్మకం ద్రోహం చేయడంలో చంద్రబాబు దిట్ట’’ అని తన వంతుగా వ్యాఖ్యానించారు.  బాబుకు దూరంగా ఉండాలనే వైసీపీలో చేరానని కదిరి బాబూరావు అన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తాను విధేయుడిగా ఉన్నానని, తొలి ఓటు టీడీపీకే వేశానని ఈ సందర్భంగా బాబూరావు అన్నారు. 

విధేయులను చేర్చుకుని ఆ మాట చెప్పించడమే జగన్ వ్యూహంలో భాగం. తనకు లేని విశ్వసనీయత తెచ్చుకోవడం కష్టమైనపుడు ఏ రాజకీయ నాయకుడు అయినా చేసే పని ఒకటే... ఎదుటి వారి విశ్వసనీయతను దెబ్బతీయడం. ఈ విషయంలో జగన్ వరుసగా సక్సెస్ అవుతున్నారు. తాను మంచివాడు అనిపించుకోవడం అనే ప్రక్రియ కన్నా ఎదుటి వాడిని చెడ్డవాడు అని నిరూపించడమే సులువు అన్న లాజిక్ ను జగన్ పక్కాగా అనుసరించారు.