బాలయ్యా మజాకా... ఆస్ట్రేలియా టు అమెరికా

August 12, 2020

న్యూయర్ సంబరాలు మొదట ఆ స్ట్రేలియాలో జరుగుతాయి. ఎందుకో తెలుసా... ప్రపంచం 24 గంటల టైం జోన్ (12+12 ) ప్రకారం ఆ స్ట్రేలియాలో ముందు కొత్త తేదీ మొదలవుతుంది. ఇది కేవలం న్యూ ఇయర్ సమయంలో మనం గమనిస్తుంటాం. కానీ తొలిసారి ఈసారి బాలయ్య దానిని మనకు గుర్తుచేశాడు. జూన్ 10 తొలుత మొదలయ్యే ఆ స్ట్రేలియాలో బాలయ్య పుట్టిన రోజు వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఇది బాలయ్య బాబు క్రేజుకు ఉదాహరణ. 

కోవిడ్ నిబంధనలు ఉన్నా కూడా బాలకృష్ణ అభిమానులు తమదైన శైలిలో పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నారు.  ఆస్ట్రేలియాలో పెద్ద సంఖ్యలో బాలయ్య అభిమానులు బాలకృష్ణ 60వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. తెలుగుదేశం మెల్‌బోర్న్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి తమ అభిమాన నటుడికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు తెలుగుదేశం మెల్‌బోర్న్ సభ్యులు.