బాలయ్య... వెరీ రేర్ పిక్స్ ఇవిగో

August 08, 2020

 Image

నందమూరి బాలకృష్ణ... టాలీవుడ్లో ఒక స్పెషల్ క్యారెక్టర్. బాలయ్య ఊరికే ఎవరి మీద నోరు పారేసుకోడు. కోపమొస్తే ఆపుకోలేడు. బాలయ్య గురించి టాలీవుడ్లో అందరికీ ఒక ఐడియా ఉంది. కాబట్టే బాలయ్య ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వాటిని అనవసరంగా ఇష్యూ చేయరు. బాలయ్య అన్నమాటలు బాలయ్యతోనే ఆగిపోతాయి. 

బాలయ్యను నొప్పిస్తే అది బయటకు రాకుండా ఆగదు. కాబట్టి బాలయ్య ఇష్యూలో ఎవరూ నోరు జారరు. నోరు జారినా బాలయ్య వదలరు. ఇక బాలకృష్ణ ఫ్యాన్సంటారా.... ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది. చెడుగుడు ఆడుకోవడమే. 10వ తేదీ బాలయ్య 60వ జన్మదినోత్సవం. అపుడే బాలయ్య పుట్టిన రోజు సందడి మొదలైంది. పైగా ఇది షష్టి పూర్తి సంవత్సరం కావడంతో అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. బాలయ్య కామన్ డీపీని ఆయన కూతురు నారా బ్రాహ్మణి విడుదల చేశారు.