Photos: బాలయ్య ఇంట్లో చంద్రబాబు సందడి

August 13, 2020

హైదరాబాదులోనే ఉన్నచంద్రబాబు నాయుడు తన వియ్యంకుడు, బావమరిది అయిన బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలకు హాజరై బావమరిదికి కేకు తినిపించారు. చంద్రబాబుతో పాటు మొత్తం కుటుంబం బాలయ్య ఇంటికి వెళ్లి సందడి చేశారు. ఎన్బీకే 1960 పేరిట కూతర్లు, అల్లుళ్లు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న డ్రెస్ కోడులో నాన్న పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిపారు.

నందమూరి సుహాసిని కూడా బాలయ్య ఇంటికి వచ్చి బాబాయికి శుభాకాంక్షలు చెప్పారు. నారా లోకేష్, బ్రాహ్మణి, శ్రీభరత్, తేజస్విని, మోక్షజ్జ తదితరులు ప్రత్యేక టీషర్టులతో అలరించారు. బాలయ్య మనవళ్లు వచ్చీరాని మాటలతో తాతకు శుభాకాంక్షలు చెబుతుంటే అంతా సందడిసందడిగా గడిచింది.