బాలకృష్ణ అంటే గౌరవం - నాగబాబు !! తెరవెనుక ఏం జరిగింది??

August 07, 2020

నందమూరి బాలకృష్ణ - నాగబాబు మొత్తం వ్యవహారం యుటర్న్ తీసుకుంది. బాలకృష్ణ చేసిన కామెంట్లపై ఆవేశంగా రియాక్టైన నాగబాబు రిగ్రెట్ అయ్యారు. తెర వెనుక ఏం జరిగిందనేది ఇంకా బయటకు రాలేదు గాని మూడునాలుగు రోజులుగా బాలయ్య గురించి ఎవరడిగినా... చాలా కూల్ గా ఆ గొడవకు తెర దించడానికే నాగబాబు ప్రయత్నం చేస్తున్నారు. తన కోపాన్ని బాలయ్య మీద నుంచి తెలుగుదేశానికి మళ్లించారు. అయితే బాలయ్య విషయంలో మాత్రం మొత్తం వాతావరణం మారిపోయింది.

’’నందమూరి బాలకృష్ణతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. పైగా ఆయనంటే నాకు గౌరవం. ఆరోజు ఆయన అన్నమాటలకు మాత్రం నా రిప్లై. అంతకుమించి ఏం లేదు. అయినా బాలయ్యపై ఫైర్ కావడానికి నేనెవరనండీ. ఒకరిపై ఫైర్ అయ్యేటంత గొప్పోడిని కాదు. ఈ ఇష్యూలో నా ఒపీనియన్ నేను చెప్పాను. బాలకృష్ణ గారితో ఏ విషయంలోను నేను సమానం కాదు. నేను చిరంజీవి సోదరుడిని మాత్రమే. బాలకృష్ణలా హీరోని కాదు... ఆయనతో నేను సమానం కాదు, ఆయన కూడా రియలైజ్ అయ్యారు‘‘ 

ఇవి నాగబాబు తాజా కామెంట్స్. ఎవరు ఏమన్నారో కానీ నాగబాబు టోన్ వంద శాతం మారిపోయింది. వాస్తవానికి నాగబాబు చెప్పినట్లు బాలకృష్న సారీ చెప్పలేదు. పైగా మరోసారి స్వార్థం ఉన్నంత కాలం వివాదాలు సమసిపోవు అని కామెంట్లు కూడా చేశారు. మరి ఏమైందో ఏమో గాని నాగబాబు ... బాలయ్యకు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే భయపడుతున్నారిపుడు. ఏమిటో కథ