బాలకృష్ణ ఆన్ ఫైర్ : నాకు మర్యాద ఇచ్చి, మర్యాదు పుచ్చుకోండి... ఎవడైనా!!

August 10, 2020

బాలకృష్ణ... తనకు నచ్చని మాట తప్ప ఇంకొకరి మాటలు తన నోటితో పలకడానికి ఒప్పుకోరు. బహుశా ఇతరుల సలహా వల్ల కొన్ని సార్లు సైలెంటుగా ఉంటారేమో గానీ... ఇంకొకరు రాసిచ్చిన స్క్రిప్ట్ జన్మలో చదవరు. అది కేవలం సినిమాలకే పరిమితం. 

వ్యక్తిగత జీవితంలో బాలయ్య ఒక సంచలనం. తనకు నచ్చింది మాట్లాడతాడు. తనకు అనిపించిందే చేస్తాడు. ఇంకొకరి జీవితంలోకి పోడు... ఇంకెవరైనా తన జీవితంలోకి వస్తే ఊరుకోడు. 

తాజాగా సినిమా పెద్దలు బాలకృష్ణకు మాట మాత్రమైన చెప్పకుండా మీటింగులు పెట్టుకుంటే దాని గురించి తనంతట తాను స్పందించలేదు. మీడియా అడిగితే మాత్రమే.. కొందరిని పిలవకుండా పెట్టుకున్నారంటే... ఏం భూములు పంపకమో... ఇంకేం రహస్యాలు మాట్లాడాలనుకున్నారో అంటూ సీరియస్ గా చురక వేశారు బాలకృష్ణ. 

ఆ మీటింగుకి వెళ్లిన వారు ఎవరూ స్పందించలేదు గానీ నాగబాబు భుజాలెగరేసుకున్నారు. అయితే... నాగబాబుకి ఎవరి నుంచి పెద్దగా మద్దతు దొరకలేదు. అందరూ సైలెంటుగా ఉన్నారు. చివరకు అన్న చిరంజీవి కూడా ఏమీ మాట్లాడలేదు.

ఇదిలా ఉంటే.. బాలకృష్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. నాగబాబు వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తే.. నేనేం మాట్లాడలా, అతనే మాట్లాడుకుంటున్నాడు. నేను మాట్లాడను. ఛీఛీ నేను మాట్లాడటమేంటి?... అలాంటి విషయాల గురించి. ఇవాళ ఇండస్ట్రీ అంతా నాకు మద్దతు పలుకుతోంది.

ఎవరైనా నాకు మర్యాద ఇచ్చి మర్యాదు పుచ్చుకోవాలి. నోటికొచ్చినట్లు కుక్కల్లా మొరగకూడదు అంటూ వ్యాఖ్యానించారు. ఇంకా అనేక విషయాలపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇదే ఆ ఇంటర్వ్యూ.... వీడియో మధ్యలో ఎక్కడ క్లిక్ చేసినా వీడియో ప్లే అవుతుంది